Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీ అలర్ట్.. తెలంగాణలో కాసేపట్లో పిడుగుల వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ఆవర్తనం సందర్భంగా ఇవాళ సాయంత్రం, రాత్రి సమయాల్లో పిడుగుల వర్షం పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్, మెదక్, ఆసిఫాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరిలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలోని 24 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసేవాళ్లు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని పేర్కొంది.

అయితే మరోవైపు తెలంగాణలో ఆదివారం భానుడు ప్రతాపం చూపించాడు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదిలాబాద్ లో ఏప్రిల్ 20న అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక మెదక్‌లో 23.8 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2- 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Heavy Rain Alert Issued for Several Districts in Telangana

ఏప్రిల్ 20న ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీలు, నిజామాబాద్‌ 43.1డిగ్రీలు, భద్రాచలం 39.4 డిగ్రీలు, దుండిగల్‌ 38.7 డిగ్రీలు, హన్మకొండ 40డిగ్రీలు, ఖమ్మం 40.4డిగ్రీలు, మహబూబ్‌నగర్‌ 40డిగ్రీలు, రామగుండం 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రానున్న 2 రోజులు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+