నగరంలో భారీ వర్షం: కమ్మేసిన మబ్బులు.. నాలుగింటికే చీకట్లు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నిన్న మొన్నటిదాకా ఎండలకు తాళలేకపోయిన నగర జనం.. ప్రస్తుతం చల్లటి వాతావరణంలో సేదతీరుతున్నారు. గురువారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కీసర, నాగారం, కాప్రా, చర్లపల్లిలలో భారీ వర్షం పడింది.

భారీ వర్షానికి రోడ్ల పైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎక్కడిక్కకడ ట్రాఫిక్ జామై వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడంతో నగరవ్యాప్తంగా సాయంత్రమే చీకటి పడిన వాతావారణాన్ని తలపిస్తోంది. వాహనదారులంతా లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

heavy rain in hyderabad on thursday evening

కాగా, ఈసారి అనుకున్న దానికన్నా నాలుగైదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకనున్నాయని వాతావరణశాఖ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A thunderstorm struck several parts of Hyderabad on Thursday evening. Major junctions and areas of prime connectivity were inundated till late afternoon, low-lying colonies were flooded,
Please Wait while comments are loading...