హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన: వరదలోనే రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, మరో 4 రోజులు

హైదరాబాద్: రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వానలు దంచికొట్టగా.. సోమవారం ఉదయం నుంచి కుండపోత వర్షం పడింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు.

భాగ్యనగరంలోని ఖైరతాబాద్, లక్డీకపూల్, కూకట్‌పల్లి, ఎర్రమంజిల్, బషీర్‌బాగ్‌, అమీర్‌పేట్‌, తార్నాక, చింతలబస్తీ, సోమాజిగూడ, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, మాదాపూర్‌, ఉప్పల్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌లో భారీ వర్షం పడుతోంది. దీంతో ఉదయాన్నే పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు తప్పలేదు. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Heavy rains in Hyderabad city: next four days rains in telangana districts

భారీ వర్షానికి నగరంలోని రహదారులన్ని జలమయమయ్యాయి. పలుప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాలుమంటి వరదనీరు ప్రవహిస్తోంది. ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌, జవహర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేని వానకు నాలాలు పొంగి ఆ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. దీంతో నగరవాసులు సీజనల్ వ్యాధుల బారినపడుతున్నారు.

మరోవైపు రానున్న నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్‌ ప్రాంతం వరకూ విస్తరించింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+