తెలంగాణను వీడనంటున్న వరుణుడు.. పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు..
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షాలకు నగరంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నేటి తెల్లవారు జాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భాగ్యనగరంలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఉత్తర కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉండడంతో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక, నగరంలోరి పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసింది. నేడు పట్టణంలోని మహబూబాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది.

ఈ మేరకు ఐఎండీ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. వీటితోపాటు సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, వికారాబాద్, యాదాద్రి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
ప్రజలకు సూచనలు..
ఇక, నేడు రేపు, ఎల్లుండి తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. వర్షం, ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నాయి. ఈ వర్షాలు పడే సమయంలో ప్రజలు కాస్తఅప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులకు పలు సూచనలు చేశారు. పొలం పనులకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications