కరుణించవా వరుణ దేవా.. హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం !
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సిబ్బంది సూచించారు. పలు రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాతావరణ శాఖ సూచనలు..
టెంట్లు, చెట్లు, మీటల్ పైపు నిర్మాణాల వద్ద నిలుచోవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, నీటిలో మునిగిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇక మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 12, 13, 15 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆయా జిల్లాలల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే ఆగస్ట్ 15వ తేదీ వరకు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే 15వ తేదీన పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
HyderabadRains ALERT 4 ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) August 9, 2025
As said earlier, MASSIVE DOWNPOURS will gradually reduce by 10.30PM in Core Hyderabad City. Persistent LIGHT - MODERATE showers will continue till midnight in entire Hyderabad City. Please STAY SAFE 🙏
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications