మరికాసేపట్లో హైదరాబాద్ లో కుండపోత వర్షం.. కీలక అలెర్ట్!
హైదరాబాద్ ను వర్షాలు వీడటం లేదు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లో వర్షాల బీభత్సం కొనసాగుతుంది. తాజాగా వాతావరణ శాఖ నుండి మళ్ళీ కీలక అలెర్ట్ వచ్చింది. బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం
నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. నేడు కూడా హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరవాసులు మరోమారు భారీ వర్షాన్ని చూడబోతున్నారు అని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ పేర్కొంది.

రాగల 24 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షాలు
రాగల 24 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అప్రమత్తం అవుతున్నారు. హైదరాబాద్ లో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 11 గంటల వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది.
చాలా ప్రాంతాలలో 25 మిల్లీ మీటర్ల నుంచి 55మిల్లీమీటర్ల వర్షపాతం
హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలలో 25 మిల్లీ మీటర్ల నుంచి 55మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈరోజు రాత్రి 11:00 నుంచి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సాయంత్రం వేళ ఈరోజు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, వర్షాలలో ఇబ్బందులు పడకుండా ఉండాలని సూచించింది. ఇక సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం వర్షాలు కురుస్తాయి అన్న హెచ్చరికల నేపథ్యంలో వాహనదారులను అలర్ట్ చేసింది.












Click it and Unblock the Notifications