Rains: రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పశ్చమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోనే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు మరో రెండు పాటు ఉంటాయని పేర్కొంది. మంగళవారం రాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్ వాన పడుతోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
అత్యధికంగా జనగామ జిల్లా నర్మెట్టలో 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఖమ్మం జిల్లా వైరాలో 36 మిల్లీమీటర్లు, కొడకండ్లలో 25 మిల్లీమీటర్లు, నారాయణపేటలో 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. బుధ, గురువారం కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది.

పెద్దపల్లి జిల్లా, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. గురువారం పెద్దపల్లి జిల్లా, నిజామాబాద్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ లో భారీ వర్షాలకు ఛాన్సు ఉన్నట్లు హెచ్చరించింది.

శుక్రవారం కూడా వర్షాలు కొసాగుతాయని ప్రకటించింది. జులై 7న మెదక్, కామారెడ్డి, జనగామ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పలు ఏరియాల్లో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications