బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలు ప్రముఖులను విచారించింది ఈడీ. ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరయ్యారు.
విజయ్ పై విచారణలో ప్రధాన అంశాలు..
విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసిన చట్ట విరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా తీసుకున్న పారితోషికం.. కమీషన్లు, అలాగే మనీలాండరింగ్ కోణంలో జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. యాప్‌ల ప్రచారం ద్వారా అందుకున్న ఆర్ధిక లాభాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అకౌంట్ల ట్రాన్సాక్షన్లు, డిజిటల్ ఫుట్‌ప్రింట్లు, ఐటీ రిపోర్టులు తదితర ఆధారాలపై ఈడీ మానిటరింగ్ కొనసాగుతోంది.

ఇతర ప్రముఖులకు కూడా ఈడీ నోటీసులు..
ఈ కేసులో 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ లిస్టులో విజయ్ తో పాటు దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, దివి.. సహా పలువురు ఉన్నారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్‌ను ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ ఇవ్వబోనని స్పష్టం చేశారు.
అలాగే హీరో దగ్గుబాటి రానాకి ఆగస్టు 11న, నటి మంచు లక్ష్మీకి ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. వీరిద్దరూ కూడా గతంలో వివిధ ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేశారు.
కేంద్రం ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించినప్పటికీ, ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు ఆ యాప్స్‌కు ప్రచారం చేశారు? అని ప్రధానంగా ఈడీ అధికారులు విచారణ జరుగుతుంది. ఈ కేసు టాలీవుడ్‌తో పాటు పలు ఇతర భాషల సినీ పరిశ్రమలకూ విస్తరించవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొన్ని డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు, యూట్యూబ్ చానెళ్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల సమాచారం సేకరించారు ఈడీ అధికారులు.
-
హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేస్తుంది..గూస్బంప్స్ గ్యారెంటీ బాసూ -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
రూ.10 కోట్లు బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ !!











Click it and Unblock the Notifications