హీరో ఉదయ్ కిరణ్ వద్ద తుపాకీ, పోలీసుల ఆరా: పీడీ యాక్ట్‌తో షాక్!

హైదరాబాద్: హోటల్‌ దసపల్లాలోని పబ్‌పై బుధవారం దాడి చేసిన 'ఫ్రెండ్స్‌ బుక్‌' హీరో ఉదయ్ కిరణ్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఉదయ్ కిరణ్‌ను రెండు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించింది.

ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు రెండు రోజుల కస్టడీలో భాగంగా బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయ్ కిరణ్‌పై గతంలో మాదకద్రవ్యాల సరఫరా కేసుతోపాటు నగరం, కాకినాడలోని వివిధ ఠాణాలు, సీసీఎస్ స్టేషన్‌ల పరిధిలో నమోదైన కేసులనూ విచారిస్తున్నారు.

అతని వద్ద ఓ తుపాకీ ఉందనే సమాచారం మేరకు పోలీసులు ఆ దిశగా కూడా విచారిస్తున్నారని తెలుస్తోంది. డ్రగ్స్‌తోపాటు పదేపదే మోసం, గొడవలకు దిగడం తదితర ఘటనల నేపథ్యంలో పీడీ చట్టాన్ని ప్రయోగించాలని చూస్తున్నారని తెలుస్తోంది.

Hero Uday Kiran in Police custody

కాగా, ఉదయ్ కిరణ్ పబ్‌లో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. నాకే లోపలికి అనుమతివ్వవా, నా ప్రొడక్షన్‌ సభ్యులంతా ఇక్కడే ఉన్నారని, నన్ను అవమానిస్తావా అంటూ ఉదయ్ కిరణ్‌ చేసిన హంగామాతో కూడిన సీసీ ఫుటేజీని శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసులు విడుదల చేశారు. దీంట్లో బుధవారం రాత్రి పబ్‌కు వెళ్లిన ఉదయ్ కిరణ్‌ చొక్కా విప్పి హడావుడి చేసినట్లుగా ఉంది.

తలుపులను బలంగా తన్నడం. సీసీ కెమెరాను లాగే ప్రయత్నం చేయడం వంటివి ఉన్నాయి. అక్కడున్న వారు అడ్డగించే ప్రయత్నం చేస్తే ఎగిరెగిరి కాలితో తన్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించగా నానా హంగామా సృష్టించాడని పోలీసులు చెప్పారు. మరోవైపు, తన పైన వచ్చిన ఆరోపణలను ఉదయ్ కిరణ్ కొట్టిపారేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+