మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను కొట్టేసిన హైకోర్టు!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై పిటీషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ లో మల్లారెడ్డి తాను అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు, గతంలో రెండు ఎన్నికలలో పేర్కొన్న అంశాలతో ఏ విధంగానూ మ్యాచ్ కాకపోవడంతో ఆయన అఫిడవిట్ ను సవాల్ చేస్తూ అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ప్యాట్నీ లోని ప్రభుత్వ కాలేజీలో 1973వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివినట్టు పేర్కొన్నారు. ఇక 2018 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం 2023 మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఆయన రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారని ఆయన ఇంటర్ చదువు విషయంలో ఏది కరెక్ట్ అన్నారు. 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి వయసు 56 సంవత్సరాలని ఇచ్చారని, ఇప్పుడు వయసు 70 సంవత్సరాలు అని ఇచ్చారన్నారు.
2014 నుండి 2023 వరకు 9 సంవత్సరాలే అవుతుందని, అలాంటప్పుడు మంత్రి మల్లారెడ్డి వయసు 70 సంవత్సరాలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇక ఆస్తుల వివరాల్లో కూడా మంత్రి మల్లారెడ్డి అన్ని తప్పులే ఇచ్చారని ఆయన నామినేషన్ను తిరస్కరించడానికి ఈ ఆధారాలు చాలని పేర్కొన్నారు. ఈ మూడు అఫిడవిట్ లపై రాంపల్లి దాయార గ్రామవాసి అయిన కందాడి అంజిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ ఇచ్చారు.
అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని అంజిరెడ్డి కోర్టు మెట్లెక్కారు. ఆయన నామినేషన్ తిరస్కరించేలా ఆదేశాలు జారీ చెయ్యాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఫిర్యాదుదారుడికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానం ఇచ్చినట్టు ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పటంతో ఈ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications