Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నమనేని రమేష్‌పై హైకోర్టు ఆగ్రహం: జర్మనీ పౌరుడే, భారీ జరిమానా

బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఎట్టకేలకు షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని స్పష్టం చేసింది. కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని పేర్కొంది. అంతేగాక, చెన్నమనేని రమేష్‌కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. దీనిలో రూ. 25 లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని, రూ. 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

High Court rules that Chennamaneni Ramesh is a German citizen 30 lakh fine

చెన్నమనేని రమేష్‌ కు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ.. తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లోనే విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం.. 2017లో రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. మరోసారి పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో పునర్ పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయం సరైనదేనంటూ రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. దీంతో చెన్నమనేని రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. చెన్నమనేని రమేష్ జర్మనీ ప్రయాణ వివరాలు ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. సంబంధిత రికార్డులను హైకోర్టుకు అందజేసింది. అయితే, జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు హైకోర్టులో మెమో దాఖలు చేశారు చెన్నమనేని రమేష్. దీంతో చాలా ఏళ్లుగా రమేష్ పౌరసత్వానికి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా, సోమవారం ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తవడంతో చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని తేల్చి చెప్పిన హైకోర్టు.. అతనికి రూ. 30 లక్షల జరిమానాను విధించింది. హైకోర్టు తీర్పును ఆది శ్రీనివాస్ స్వాగతించారు. తన 15 ఏళ్ల న్యాయ పోరాటం ఇన్నేళ్లకు విజయం సాధించిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+