కూల్చివేత ఆదేశాలతో.. కేసీఆర్ కు హైకోర్టు ఊహించని షాక్!
తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయడానికి ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. 15 రోజుల్లో నల్గొండ బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీసును కూల్చి వెయ్యాలని ఆదేశించింది. బిఆర్ఎస్ పార్టీ వేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
కేసీఆర్ కు షాక్
బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నుండి వరుసగా ఎక్కడికి వెళ్లినా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బీ ఆర్ ఎస్ పార్టీ ఆఫీసు విషయంలో కోర్టు మెట్లు ఎక్కిన బీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. కోర్టు నిర్ణయం ఊరట ఇస్తుంది అనుకుంటే ఊహించని షాక్ ఇచ్చింది.

విలువైన భూమి అతి తక్కువ ధరకు లీజ్ తీసుకున్న బీఆర్ఎస్
నల్గొండ టౌన్ లో అత్యంత విలువైన ప్రాంతంగా ఉన్న చోట హైదరాబాద్ రోడ్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 99 ఏళ్లకు లీజుకు తీసుకొని నిర్మించింది. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన విలువైన భూమిలో ఎకరా స్థలాన్ని గజానికి కేవలం 100 రూపాయలు చొప్పున ఏడాదికి చెల్లించేలా అతి తక్కువ డబ్బు చెల్లించే విధంగా బిఆర్ఎస్ జిల్లా శాఖకు నాటి ప్రభుత్వం లీజుకి ఇచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై వివాదం
ఇక బీఆర్ఎస్ ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించిందని గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది.అయితే ముఖ్యమైన ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన భూమిని అధికార దుర్వినియోగం చేసే అప్పనంగా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొని, ప్రస్తుతం మార్కెట్ విలువ రెండు కోట్ల పైగా ఉన్న ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
అనుమతులు లేని బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని కూల్చేయాలన్న మంత్రి
అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు బహిరంగంగానే చెప్పారు. దీంతో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మున్సిపల్ అధికారులు ఫైనల్ గా నోటీసులు కూడా ఇచ్చారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఆపే విధంగా బిఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టులో బీఆర్ఎస్ కు ఊహించని షాక్
దీంతో కోర్టు ఈ కేసు విచారణ జరిపి ఆఫీసు కట్టక ముందే అనుమతి తీసుకోవాలి కదా అంటూ బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించింది. ఆఫీస్ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పార్టీ ఆఫీసు నిర్మాణం చట్ట ఉల్లంఘన అవుతుందని చెప్పిన న్యాయస్థానం 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications