హిట్ అండ్ రన్: వ్యక్తికి తీవ్రగాయాలు, మద్యం మత్తులో డ్రైవర్

హైద‌రాబాద్‌: మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఇతరు ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి సంఖ్య నగరంలో రోజురోజుకు పెరిగిపోతోంది. గతంలో మద్యం మత్తుల యువకులు కారు నడిపి మరో కారును ఢీకొట్డంతో రమ్య అనే చిన్నారి మృత్యువాతపడింది. ఇటీవల ఇదే తరహా ఘటనలో మరో చిన్నారి సంజన తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బ్రెయిడ్ డెడ్ అని ప్రకటించిన వైద్యులు.. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు.

ఇవి ఇలా ఉండగా, తాజాగా మరో ఘటన నగరంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ వ్యక్తిని ఢీ కొట్టిన ఘ‌టన కర్మాన్‌ఘాట్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్య‌క్తికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మాన్‌ఘాట్‌ గాయాత్రి నగర్‌లో రత్నాకర్ రెడ్డి అతిగా మద్యం తాగి వేగంగా కారు నడుపుతూ .. రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న యాదగిరి(48)ని ఢీకొట్టాడు.

స్థానికులు గాయపడిన యాదగిరిని కొత్తపేటలోని సాయి సంజీవని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ రత్నాకర్‌ రెడ్డిపై కేసు నమోదు చేసుకున్నారు. రత్నాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Hit and run: A man injured in Hyderabad

డిపార్చర్ రేలింగ్ నుంచి కిందపడ్డ చిన్నారి

శంషాబాద్ విమానాశ్రయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవ్యా అనే ఆరేళ్ల చిన్నారి డిపార్చర్ రేలింగ్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. దీంతో పాప తలకు తీవ్రగాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం హుటాహుటిన విమానాశ్రయంలోని అపోలో ఆస్పతికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బంధువులకు సెండాఫ్ చెప్పేందుకు తల్లిదండ్రులతో పాప ఎయిర్‌పోర్టుకు వచ్చింది. బాధిత కుటుంబం హైదరాబాద్ కొత్తపేటకు చెందినవారుగా తెలిసింది.

యువకుడి అనుమానాస్పద మృతి

కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల మండలం పెద్దూరు వద్ద అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. మానేరులో యువకుడు శవమై తేలాడు. అయితే మానేరు వద్ద ఒడ్డుపై యువకుడి దుస్తులు, చెప్పులు ఉన్నాయి. యువకుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+