Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైటెక్ వ్యభిచారం: సిద్ధార్థ గుట్టు, ఇద్దరు సినీ ప్రముఖులతో లింక్స్

స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సిద్ధార్థ చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

హైదరాబాద్: స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సిద్ధార్థ చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సైబరాబాదు పరిధిలోని పలు స్పా, మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించి థాయ్‌లాండ్ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

ఈ హైటెక్ వ్యభిచార ముఠాను గుట్టుగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సిద్దార్థ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు మంగళవారం మీడియాలో వచ్చాయి. స్పా, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం మాత్రమే కాకుండా డ్రగ్స్ వినియోగం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

స్పా,, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యవహారంలో కీలక పాత్రధారిగా పోలీసుల అదుపులో ఉన్న సిద్ధార్థ్‌కు సినీ రంగానికి చెందిన ఇద్దరితో దగ్గరి సంబంధం ఉందని కూడా పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కాగా, మరొకరు వ్యాంప్‌ పాత్రలు చేసే నటి అని సిద్ధార్థ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.

వెండి తెర నుంచి, బుల్లి తెర నుంచి...

వెండి తెర నుంచి, బుల్లి తెర నుంచి...

ఓ రియాలిటీ షోలో నటించిన నటి, నటుడు స్పాలకు వచ్చే సన్నిహితుల కోసం, వీఐపీ కస్టమర్ల కోసం వెండి తెర, బుల్లి తెరల నుంచి కొందరిని సరఫరా చేసేవారని సిద్ధార్థ వెల్లడించినట్లు తెలుస్తోందంటూ వార్తాకథనాలు వచ్చాయి. వారిలో కొందరు టీవీ ఆర్టిస్టులు, సినిమాల్లో వ్యాంప్‌ పాత్రలు చేసేవారు, కొందరు జూనియర్‌ ఆర్టిస్టులు కూడా ఉన్నారని అతను చెప్పినట్లు, వారి పేర్లు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది.

గతంలో వ్యభిచారం కేసులో...

గతంలో వ్యభిచారం కేసులో...

వారిలో ఒక సినీ నటి ఇంతకు ముందు వ్యభిచారం కేసులో అరెస్టైనట్లు విచారణలో తేలింది. స్నేహితులతో కలిసి తరచూ గోవా పార్టీలు చేసుకునే వాళ్లమని, దానికి గ్లామర్‌ టచ్‌ తప్పనిసరిగా ఉండేదని సిద్దార్థ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఎవరికీ తెలియకుండా ఎంజాయ్‌ చేయడానికి స్పాలు, మసాజ్‌ సెంటర్లు ఉపయోగపడుతున్నట్లు సిద్ధార్థ్‌ పోలీసు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. థాయిలాండ్‌, మకావూ తదితర దేశాల్లో దొరికే వినోదాలను ఇప్పుడు హైదరాబాద్‌లోనే అందిస్తున్నామని అతను చెప్పినట్లు తెలుస్తోంది.

కింగ్ పిన్ అతనే...

కింగ్ పిన్ అతనే...

సైబరాబాద్‌ పోలీసులు శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున స్పాలు, థాయ్‌ మసాజ్‌ సెంటర్లపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. పలు స్పాలు నిర్వహిస్తోన్న సిద్ధార్థ్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. స్పాల నిర్వహణ, దాని పేరిట సాగుతోన్న చీకటి దందాకు సిద్ధార్థే కింగ్‌పిన్‌ అని ఇతర నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. తొలుత అతను సమాచారం ఇచ్చేందుకు బెట్టు చేశాడని, దారిలోకి వచ్చి పలు విషయాలు వెల్లడించిట్లు తెలుస్తోంది.

తెరచాటు అవసరాలు తీర్చడానికే

తెరచాటు అవసరాలు తీర్చడానికే

అంతకు ముందు జల్సాలు చేస్తూ వచ్చిన తాను తన, ఇతరుల తెరచాటు అవసరాలు తీర్చడానికే థాయ్‌ మసాజ్‌ నిర్వహించినట్లు సిద్దార్థ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దందాలో విపరీతంగా డబ్బు వస్తుండటంతో కొకైన్‌ వంటి డ్రగ్స్‌కు తాను అలవాటుపడ్డానని అతను తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసిందని మీడియా కథనాలు వచ్చాయి. థాయ్‌ మహిళలను హైదరాబాద్‌కు రప్పించడం ఖరీదైన వ్యవహారంగా మారడంతో మన దేశంలోని ఈశాన్య ప్రాంతాలైన త్రిపుర, నాగాలాండ్‌, అసోం, మిజోరాం వంటి ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన అమ్మాయిలను తీసుకొచ్చి శిక్షణ ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు. మకావు తరహాలో తన స్పా వ్యాపారాన్ని డెవలప్‌ చేయాలనుకున్నానని, అందుకే థాయ్‌ అమ్మాయిలను ఇక్కడకు తీసుకొచ్చానని సిద్దార్థ్ చెప్పినట్లు సమాచారం.

నేపథ్యం ఇదీ...

నేపథ్యం ఇదీ...

ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్‌, ఐర్లండ్‌లో ఉన్నత విద్యాభ్యాసం, తండ్రి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగి అయిన సిద్ధార్థ్ జల్సాలకు అలవాటుపడే అతడు స్పా వ్యాపారంలోకి వచ్చాడు. తన అనుచరులు సర్ఫరాజ్‌ అలీ, వినయ్‌, అజయ్‌, మిగతా వారిని రంగంలోకి దింపి స్పాలను విస్తరించాడు. ఓ ఈవెంట్లో అతనికి ముంబైలో ఉన్న థాయ్‌లాండ్‌ యువతి కేకా పరిచయమైంది. మసాజ్‌ సెంటర్లలో ఉద్యోగం పేరుతో థాయ్‌లాండ్‌, ఈశాన్య రాష్ట్రాల యువతులకు ఆమె వల వేసేదని సమాచారం. నెలకు 50-90 వేల వరకు వేతనంగా చూపించేది. అందుకు అంగీకరించిన యువతులను సిద్ధార్థ్‌కు పరిచయం చేసేది. వారితో మొదట మసాజ్‌ చేయించిన సిద్ధార్థ్‌ కస్టమర్ల కోరిక తీర్చితే వేతనంతోపాటు భారీగా కమీషన్‌ కూడా ఇస్తానని ఆశ పెట్టేవాడని సమాచారం.

 అక్కడ లీగలైజ్ కావడంతో....

అక్కడ లీగలైజ్ కావడంతో....

థాయిలాండ్‌లో వ్యభిచారం లీగలైజ్డ్‌ కావడంతో యువతులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ దందాలో సిద్ధార్థ్ నెలకు కోటికిపైగా సంపాదించే వాడని అంటున్నారు. కాగా, తమను ఇక్కడి నుంచి పంపించేయాలంటూ మసాజ్‌ సెంటర్లలో పట్టుబడిన థాయ్‌ యువతులు రెస్క్యూ హోం నిర్వాహకులతో వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. అలా దొరికిన 34 మంది థాయిలాండ్‌ యువతులను స్వదేశానికి పంపడానికి సైబరాబాద్‌ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+