విద్యా సంస్థల సెలవుల పొడిగింపు, సీఎం సమీక్ష - హైదరాబాద్ కు తాజా అలర్ట్..!!
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగుతున్నాయి. పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రేపు (శుక్రవారం) కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది. సీఎస్ శాంతి కుమారి అధికారులను అప్రమత్తం చేసారు. ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. హైదరాబాద్ లో ఇవాళ రాత్రి భారీ వర్షం అలర్ట్ జారీ అయింది.
విద్యా సంస్థలకు సెలవు : తెలంగాణలో కుండపోత వానలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం రేపు (శుక్రవారం) కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

రాష్ట్రంలో వర్షాలు, వరద తీవ్రతపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రతను ప్రగతి భవన్ నుంచి ఎప్పటికిప్పుడు సీఎం పర్యవేక్షిస్తున్నారు. వరద తాకిడి గురయిన భూపాలపల్లి జిల్లా మొరంచపల్లెకు ఆర్మీ హెలికాప్టర్ పంపాలని సీఎం ఆదేశించారు. ఆర్మీని సంప్రదించాలని సీఎస్‌కు సూచించారు.
వరద బీభత్సం : భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరద బీభత్సం సృష్టించింది. మోరంచవాగు పొంగడంతో మోరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. మోరంచపల్లిలో వరద ఉధృతికి ఐదుగురు గల్లంతు కావడంతో గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామాన్ని వరద ముంచెత్తడంతో ఇళ్లు, చెట్లు ఎక్కిన జనాలు ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి.
భవనాలపైకి ఎక్కి సాయం కోసం గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రక్షించాలంటూ మోరంచపల్లి గ్రామస్తుల ఆర్తనాదాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మోరంచపల్లి గ్రామస్తుల మొర ఆలకించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్, భద్రాద్రి, ములుగు, వరంగల్ జిల్లాలపై వర్ష ప్రభావం అధికంగా ఉంది.

హైదరాబాద్ కు తాజా అలర్ట్ : గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ వర్షంలో తడిసి ముద్దవుతున్నది. గురువారం కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుత పరిస్థితులు, అందుతున్న సహాయక చర్యలపై మంత్రులు, అధికారులు సమీక్ష చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications