భువనగిరి కేంద్రంగా అమ్మాయిలను ముగ్గులోకి దింపే హాట్ కాలింగ్ గ్యాంగ్!

భువనగిరి: అమ్మాయి అందంగా ఉన్నా, లేకపోయినా పర్వాలేదుకానీ.. గొంతు మాత్రం బాగుంటే చాలు. కాస్తంత హస్కీ వాయిస్, మాట్లాడే మాటల్లో కాస్తంత రొమాంటిక్ టచ్ ఉంటుందని అనిపిస్తే చాలు.. అలాంటి అమ్మాయిలపై వీరు వల విసురుతారు.

కాల్ సెంటర్‌లో ఉద్యోగమని నమ్మబలుకుతారు. అధిక జీతం వస్తుందని ఆశచూపుతారు. ఐదంకెల వేతనం ఆఫర్ చేసి, బాండ్ రాయించుకుంటారు. ఆ తరువాత అసలు వ్యవహారం మొదలవుతుంది. తమ వద్ద పనిచేసే లేడీ టెలీకాలర్స్‌కు తమ అసలు ఉద్దేశం చెబుతారు. వారు చేయాల్సిన పని 'హాట్ కాలింగ్'.

 'హాట్ కాలింగ్' అంటే...

'హాట్ కాలింగ్' అంటే...

హాట్ కాలింగ్ అంటే.. కస్టమర్లకు ఫోన్ చేసి వారితో డర్టీ టాకింగ్ చేయడమే. అవును, కస్టమర్లతో అసభ్యకరంగా మాట్లాడడమే వారి ఉద్యోగం. ఒకరకంగా చెప్పాలంటే మాటలతోనే శృంగారమన్నమాట. భువనగిరి పట్టణంలో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న ఈ హాట్ కాలింగ్ గ్యాంగ్‌ను పోలీసులు పట్టేశారు.

20 మంది అమ్మాయిలతో ఇదే పని...

20 మంది అమ్మాయిలతో ఇదే పని...

భువనగరి పట్టణ పరిధిలోని మీనా నగర్ కేంద్రంగా ఈ హాట్ కాలింగ్ దందా సాగుతోంది. ఇందులో దాదాపు 20 మంది అమ్మాయిలు పని చేస్తున్నారని గుర్తించిన పోలీసులు కాల్ సెంటర్ పై దాడి చేశారు. సెంటర్ ను నిర్వహిస్తున్న వీరాస్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, సెంటర్‌ను సీజ్ చేశారు.

 నెలకు రూ.5 నుంచి 10 వేలు...

నెలకు రూ.5 నుంచి 10 వేలు...

హాట్ కాలింగ్ సెంటర్ నిర్వాహకుడు వీరాస్వామి తన వద్ద పనిచేసే అమ్మాయిలతో ఫోన్ల ద్వారా సెక్సీగా మాట్లాడిస్తూ తన కస్టమర్ల నుంచి నెలకు రూ. 5 నుంచి 10 వేల వరకూ తీసుకుంటున్నాడని, బోర్ కొట్టి కస్టమర్లు ఈ సెంటర్‌కి ఫోన్ చేసినప్పుడల్లా తన వద్ద ఉండే లేడీ కాలర్స్ తో డర్టీ టాకింగ్ చేయిస్తాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

 బెదిరించి డర్టీ టాకింగ్...

బెదిరించి డర్టీ టాకింగ్...

పాపం.. చదువుకున్న అమ్మాయిలు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం కోసం వచ్చి వీరాస్వామి బారిన పడుతున్నారు. కాల్ సెంటర్‌ ఉద్యోగాలంటూ అమ్మాయిలను నియమించుకుని, వారిని బెదిరించి వీరాస్వామి ఈ పాడు పని చేయిస్తున్నాడని, ఇంకా ఈ దందా వెనుక ఎవరెవరున్నారో కూపీలాగుతున్నామని కేసును విచారిస్తున్న పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+