య్యూట్యూబ్‌లో వచ్చే జ్యోతిష్యాన్ని నమ్మి.. గృహిణి ఆత్మహత్య..
చాలామంది జ్యోతిష్యాలను, నక్షత్రాలు, గ్రహాలు, రాశులను విపరీతంగా నమ్మేస్తుంటారు. జ్యోతిష్యంలో చెప్పిందే అక్షరాల నిజమవుతుందనే భావనతో ఉంటారు. అందుకోసం ఏమైనా చేస్తూ ఉంటారు. ఆ జ్యోతిష్యమే ఇప్పుడు ఓ గృహిణి ప్రాణాలను బలిగోంది. పచ్చని కాపురంలో జ్యోతిష్యం చిచ్చుపెట్టింది. యూట్యూబ్ జ్యోతిష్యాన్ని నమ్మి ఏకంగా తన ప్రాణాలనే తీసుకుంది. ఇంతకీ ఈ మహిళ ఎవరో చూద్దాం..
హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన బబితకు ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగితో ఐదేళ్లక్రితం వివాహమయ్యింది. బబితకు జ్యోతిష్యం అంటే ఎనలేని నమ్మకం. అందులో ఏం చెబితే నిజజీవితంలో కూడా అలాగే జరుగుతుందనే భ్రమలో ఉంటుంది. ఆ నమ్మకంతోనే యూట్యూబ్ జ్యోతిష్యాన్ని నమ్మింది. ఆ జ్యోతిషం ప్రకారం.. ఆ భార్యభర్తలిద్దరూ విడిపోతారని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని భర్తతో కూడా పలుమార్లు చెప్పేది. ఈ నేపథ్యంలోనే విసిగిపోయిన భర్త ఆమెపై చేయి చేసుకున్నాడు. అంతే, బబిత తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.

బాలంరాయికి చెందిన రామకృష్ణ, బబితలకు మూడు సంవత్సరాల కొడుకు ఉన్నారు. వీరు కానాజిగూడ ఇందిరానగర్‌లో ఉంటున్నారు. అయితే, ఆదివారం కొడుకు పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలకు కుటుంబసభ్యులు, స్థానికులు అందరూ వచ్చారు. అయితే, మరుసటి రోజు ఎప్పటిలాగే రామకృష్ణ ఆఫీసుకు బయలుదేరాడు. మూడేళ్ల చిన్నారిని బబిత అంగన్వాడీ సెంటర్‌లో వదిలేసి వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి ఇంటికొచ్చి చూసేసరికి అమ్మ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆ చిన్నారి పరుగు పరుగున వెళ్లి కిందింట్లో ఉన్న బాబాయిని పిలుచుకుని వచ్చాడు.
భార్యభర్తల మధ్య గొడవలు పెట్టిన జ్యోతిష్యం : వారు పైకి వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన బబితను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతిచెందిందని డాక్టర్లు తెలిపారు. కూతురి మరణవార్తను విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అదనపు కట్నం కోసమే తమ కూతురు ఇలాంటి దారుణానికి పాల్పడిందని బబిత తండ్రి రామకృష్ణపై దాడి చేశాడు. అయితే, రామకృష్ణ తల్లిదండ్రులు మాత్రం బబిత జ్యోతిష్యం కారణంగానే ఇలా చేసుకుందని జ్యోతిషాన్ని నమ్మవద్దని రామకృష్ణ పదేపదే చెప్పినా ఆమె వినలేదని వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు రామకృష్ణకు, బబితకు గొడవలు కూడా అయ్యాయన్నారు. పలుమార్లు చెప్పినా వినకపోయేసరికి విసుగుచెందిన రామకృష్ణ బబితపై అందరిముందు చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన బబిత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications