అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో ఎలా గడిపారంటే.. పదేపదే ఏం అడిగారంటే!
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు జారీచేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులతో అల్లు అర్జున్ కు ఈ కేసు నుండి కాస్త ఉపశమనం లభించింది.
రాత్రంతా జైల్లోనే అల్లు అర్జున్
ఈరోజు ఉదయం ఆయన జైలు నుండి బయటకు వచ్చారు. అయితే తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ ఆదేశాలు సకాలంలో జైలు అధికారులకు చేరకపోవడంతో నిన్న రాత్రి అల్లు అర్జున్ జైల్లోనే గడపాల్సి వచ్చింది. జైల్లో అల్లు అర్జున్ రాత్రంతా ఏం చేశారు? ఎలా ఉన్నారు? అన్నది ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

జైల్లో మంజీరా బ్లాక్ లోని ప్రత్యేక బారెక్ లో అల్లు అర్జున్ .. ఖైదీ నెంబర్ 7697
చంచల్ గూడా జైల్లో అల్లు అర్జున్ కు జైలు అధికారులు ఖైదీ నెంబర్ 7697 ను కేటాయించారు. ఆపై ఆయనకు భోజనం అందించారు. అయితే జైలు అధికారులు భోజనం పంపించినప్పటికీ ఆయన తినలేదని సాధారణ ఖైదీల మాదిరిగానే రాత్రంతా నేలపైన అల్లు అర్జున్ పడుకున్నారని జైలు వర్గాలు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక జైల్లో అల్లు అర్జున్ కు మంజీరా బ్లాక్ లోని ప్రత్యేక బారక్ ను కేటాయించారు.
రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన అల్లు అర్జున్
అందులో ఆయనతోపాటు ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. ఆయనకు ఒక కొత్త రగ్గు, కొత్త దుప్పటిని ఇచ్చారు జైలు అధికారులు. అయితే రాత్రంతా అల్లు అర్జున్ నిద్రపోకుండా అలాగే ఉన్నారని ఎవరితో అయినా మాట్లాడితే ఎప్పుడు విడుదల చేస్తారని మాత్రమే జైలు అధికారులతో మాట్లాడారని తెలుస్తుంది. జైల్లో ఉన్న మిగతా ఇద్దరికీ ఖైదీలతో అల్లు అర్జున్ అసలే మాట్లాడలేదని సమాచారం.
జైల్లో అల్లు అర్జున్ పదే పదే అడిగింది ఇదే
ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగానే గడిపిన ఆయన తనని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రమే పదేపదే అడిగారని సమాచారం. ఇక ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తన గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications