Barrelakka: నాగర్ కర్నూలులో బర్రెలక్కకు ఎన్నో స్థానం వచ్చిందంటే..!

బర్రెలక్క తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు తెలియని వారు ఉండరు. హాయ్ ఫ్రెండ్స్ చదువుకుని బర్రెలు కాస్తున్న అని ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది. బర్రెలక్క అంతటితో ఆగకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు. బర్రెలక్క కోసం చాలా మంది వచ్చి ప్రచారం చేశారు.

ఓ దశలో బర్రెలక్క గెలిచే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఆమెకు 6,000 ఓట్లు వచ్చాయి. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు గెలిచారు. తాజాగా బర్రెలక్క లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఈసారి బర్రెలక్క నాగర్ కర్నూలు నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి భరత్ పోటీ చేశారు. ఇక్కడ మల్లు రవి గెలుపొందారు. ఈసారి బర్రెలక్క 3,087 ఓట్లు వచ్చాయి.

How many votes did Barrelakka get in the Lok Sabha elections
మల్లు రవికి 94,414 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ పై గెలుపొందారు. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించాయి. ఇక ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంది. బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చెవేళ్ల, మహబూబ్ నగర్, మెదక్ లో విజయం సాధించింది.

కాంగ్రెస్ పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూలు, జహీరాబాద్ లో గెలుపొందింది. హైదరాబాద్ ఎంఐఎం విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ ఒక్క చోట కూడా గెలుపొందలేదు. కనీసం మెదక్ లో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+