డ్రంకెన్ డ్రైవ్: మద్యం తాగాక మసాల పుడ్‌తో తిప్పలే, పాయింట్ల ఆధారంగా శిక్షలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్రీత్ ఎనలైజర్‌లో నమోదైన పాయింట్ల ఆధారంగా మద్యం తాగుతూ వాహనాలు నడిపిన వారికి శిక్షలు పడుతాయి. అయితే ఎంత మోతాదులో తాగితే ఏ మేరకు బ్రీత్ ఎనలైజర్‌లో పాయింట్లు నమోదయ్యే విషయంలో శరీరతత్వాన్ని బట్టి కూడ ఉంటుంది.

నూతన సంవత్సరం సందర్భంగా వందలాది కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో చాలా మంది బుక్కయ్యారు. ఈ కేసులో బుక్కైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టుకు తరలిస్తారు.

అయితే బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాత్రం ఇంతవరకు కౌన్సిలింగ్ కు హజరుకాలేదు. అయితే నేరుగా కోర్టుకు హజరైనా పోలీసుల కౌన్సిలింగ్‌కు మాత్రం ప్రదీప్ మాత్రం ఖచ్చితంగా హజరుకావాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు.

 ఒక్క పెగ్గుకు 30 నుండి 50 పాయింట్లు

ఒక్క పెగ్గుకు 30 నుండి 50 పాయింట్లు

ఒక్క పెగ్గు తాగితే 30 నుండి 50 పాయింట్లు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే 60 ఎంఎల్ ఉన్న పెగ్గుకు ఈ 30 నుండి 50 పాయింట్లు నమోదు కానుంది. పెగ్ పరిమాణం పెరిగితే బ్రీత్ ఎనలైజర్లో పాయింట్ల సంఖ్య కూడ పెరిగే అవకాశం లేకపోలేదు. ఒక్క బీర్ తాగితే కూడ 50 పాయింట్లు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణుులు చెబుతున్నారు.

 స్మాల్ పెగ్ తాగితే 30 పాయింట్ల లోపు

స్మాల్ పెగ్ తాగితే 30 పాయింట్ల లోపు

30 ఎంఎల్ లోపు స్మాల్ పెగ్ తాగితే 30 పాయింట్ల కన్నా తక్కువే వస్తాయని చెబుతున్నారు నిపుణులు. మద్యం తాగాక ఏదైనా ఎక్కువగా తిని నీళ్లు ఎక్కువగా తాగితే పాయింట్లు తగ్గుతాయట. అంతేకాదు మద్యం తాగాక గంటా రెండు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పాయింట్లు పరిమాణం తగ్గుతుంది.

Drunken Drive Case : కారు కింద దాక్కునేందుకు యత్నం !
బిర్యానీ తింటే ఎక్కువ పాయింట్లు

బిర్యానీ తింటే ఎక్కువ పాయింట్లు

మద్యం తాగాక బిర్యానీ లాంటి మసాలా పదార్థాలు ఎక్కువగా తింటే మాత్రం బ్రీత్‌అనలైజర్ పరీక్షల్లో మద్యం తాగినదానికన్నా ఎక్కువ పాయింట్లు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.అయితే ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

ఎంత తాగితే ఎంత శిక్ష

ఎంత తాగితే ఎంత శిక్ష

బ్రీత్ అనలైజర్‌లో 30పాయింట్లలోపు నమోదు అయితే శిక్షలు ఉండవు. కేసు కూడా నమోదు కాదు. వెంటనే వదిలేస్తారు. పరీక్ష సమయంలో 30 పాయింట్ల కన్నా ఎక్కవ నమోదు అయితేనే కేసు పెడతారు. 30 నుంచి 50 పాయింట్ల మధ్య నమోదు అయిన వాళ్లకు ముందుగా కౌన్సిలింగ్ ఇస్తారు.

50 పాయింట్లు దాటితే శిక్షలు

50 పాయింట్లు దాటితే శిక్షలు

50 పాయింట్ల కంటే పాయింట్లు పెరిగితే జరిమానా, జైలు శిక్ష పెరుగుతూ ఉంటుంది. బ్రీత్‌అనలైజర్‌లో 50 నుంచి 100 పాయింట్లు నమోదైతే 1 నుంచి 3 రోజుల పాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. 100 పాయింట్ల నుంచి 150 పాయింట్ల మధ్య నమోదు అయితే 5 రోజుల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఇక 150 పాయింట్ల కంటే ఎక్కువ నమోదు అయితే 3 నుంచి 5 రోజులు, ఒక్కోసారి వారం రోజుల దాకా జైలు శిక్ష పడొచ్చు. అయితే ఒక్కసారి శిక్ష పడితే ఆ వివరాలు వీసా, పాస్‌పార్ట్, ఆధార్‌లలో నమోదు చేస్తారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
hyderabad traffic police registered cases as per breathalyzer tests in drunken and drive. breathalyzer registered point as per liqour content in blood

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి