రేవంత్ ఎఫెక్ట్, కేసీఆర్ అలర్ట్ - విపక్ష నేతగా "ట్రబుల్" షూటర్..!?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ లేదా భట్టిలో ఒకరికి సీఎంగా అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో విపక్ష నేత ఎవరు. పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ విపక్ష నేత పాత్ర పోషిస్తారా. కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ కంటే నాలుగు స్థానాల్లో మాత్రమే ఎక్కవ సీట్లు సాధించింది. ఏ సమయంలో అయినా హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో, కేసీఆర్ అలర్ట్ అయ్యారు. విపక్ష నేత పాత్ర ట్రబుల్ షూటర్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
కేసీఆర్ లో మొదలైన మార్పు: తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కాంగ్రెస్ లో సీఎం సీటు తో పాటుగా మంత్రి పదవులకు రేసు మొదలైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు కావాల్సిన మేజిక్ ఫిగర్ కంటే నాలుగు స్థానాలే అధికంగా ఉండటంతో పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే ఫలితాలు వచ్చిన వెంటనే రేవంత్ ను కలవటంతో ఇటు కేసీఆర్ అలర్ట్ అయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హార్స్ ట్రేడింగ్ కు పాల్పేడ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, విపక్ష నేత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హరీష్ కు బాధ్యతలు: కేసీఆర్ వ్యవహార శైలి..కుటుంబ పాలన పైన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపణలు చేసింది. కేసీఆర్ కామారెడ్డిలోనూ ఓడిపోయారు. దీంతో, కాంగ్రెస్ బలాలు..బలహీనతలు తెలిసిన కేసీఆర్ వెంటనే లోక్ సభ ఎన్నికల కోసం త్వరలోనే కార్యాచరణ ప్రారంభించనున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పాలన పైన కొంత కాలం సమయం ఇచ్చి ప్రతిపక్ష పార్టీగా తమ పాత్ర పోషించేందుకు సిద్దం అవుతున్నారు.

ఈ సమయంలోనే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కొనసాగే అవకాశం కనిపించటం లేదు. ప్రతిపక్ష నేతగా హరీష్ రావుకు అవకాశం దక్కనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ ట్రబుల్ షూటర్ గా హరీష్ కు గుర్తింపు ఉంది. పార్టీలో అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటంతో హీరష్ కు విపక్షనేతగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ - హరీష్ కాంబినేషన్ లో: అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ భవిష్యత్తులో పెను సవాళ్లను ఎదుర్కొక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మరో పక్క బీజేపీ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లతో పాటు, వరుసగా రానున్న లోక్‌సభ, మునిసిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో..కేటీఆర్ - హరీష్ కాంబినేషన్ లో పార్టీని ముందుకు తీసుకెళ్తూ..తాను పార్టీ పెద్దగా దిశా నిర్దేశం చేసేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు.

బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో గట్టీ పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్‌ఎస్ అభ్యర్థులు మనుగడను కాపాడుకోవడం కోసం కొత్త వ్యూహాలతో కేసీఆర్ సిద్దం అవుతున్నారు. అందులో భాగంగానే అంచనాలకు భిన్నంగా హరీష్ ను విపక్ష నేతగా నిర్ణయించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో పది రోజుల్లో తెలంగాణ కొత్త అసెంబ్లీ కొలువు తీరనుంది. విపక్ష నేత అంశం పైన కేసీఆర్ అధికారికంగా నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications