HPS నిధుల గోల్‌మాల్:హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అవకతవకలపై దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..!!
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేట్ ఇప్పుడు ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రపంచ యవనికపై వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారెందరో ఈ విద్యాసంస్థలో ఓనమాలు నేర్చారు. అలాంటి ఈ స్కూల్ పేరు ప్రతిష్ట మసకబారుతోంది. ఇందుకు కారణం ఇంటి దొంగలే అనే చర్చ నడుస్తోంది. తాజాగా ఈ పాఠశాలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేసి పలు సూచనలు చేసింది.
హైదరాబాదు పబ్లిక్ స్కూలు బేగంపేట్ ఘనత, ఘన చరిత్ర ఇప్పుడు కోర్టుకు ఎక్కింది. సక్రమంగా వినియోగించాల్సిన నిధులను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే దుర్గం రవీందర్ అనే వ్యక్తి పాఠశాల నిధుల దుర్వినియోగంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పాలనాపరమైన నిర్ణయాల్లో చాలామటుకు అవకతవకలు జరుగుతున్నాయని, దీంతో స్కూలు ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణకు స్వీకరించింది.పిటిషనర్ చేసిన ఆరోపణలపై విచారణ చేసి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించింది.

ఆరోపణలు తీవ్రమైనవి, పరిశీలించాల్సిందే
HPS యాజమాన్యంపై అనేక వాస్తవ ఆరోపణలు ఉన్నాయని, వాటిని చట్టబద్ధమైన అధికార యంత్రాంగం తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. "ఈ దశలో మేము వాస్తవ ఆరోపణల్లోకి వెళ్లాలనుకోవడం లేదు. ఈ ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ అధికారం ఉన్న చట్టబద్ధమైన సంస్థగా, మీరు పిటిషనర్ వినతిని పరిశీలించండి" అని విద్యాశాఖకు స్పష్టం చేస్తూ కోర్టు PILను కొట్టివేసింది.
యాజమాన్యంపై ప్రధాన ఆరోపణలు ఇవే:
పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ... HPS గతంలో ప్రభుత్వ సంస్థ అని, పాలన సౌలభ్యం కోసం దీనిని ఒక పాలక మండలికి అప్పగించారని తెలిపారు. అయితే, ప్రస్తుత యాజమాన్యం తమ సొంత ఉప-నియమాలను (Bylaws) పాటించడంలో విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా:
- నిబంధనల ఉల్లంఘన: ప్రవేశాలు (Admissions) మరియు నియామకాలలో (Recruitment) రిజర్వేషన్లు అమలు చేయడంలో బైలాస్ పాటించలేదు. బైలాస్‌లో మార్పులు ప్రతిపాదించి అసెంబ్లీకి పంపినా, అభ్యంతరాలతో గవర్నర్ వెనక్కి పంపారని తెలిపారు.
- బంధుప్రీతి ఆరోపణలు: స్కూల్ బోర్డు సభ్యుల బంధువులకే క్రీడలు, సెక్యూరిటీ, ఐటీ సర్వీసుల కాంట్రాక్టులను సరైన ఆమోదం లేకుండా అప్పగించారని ఆరోపించారు.
- అనర్హుల నియామకాలు: అనర్హులను కాంట్రాక్ట్ పోస్టుల్లో నియమించారు.
- అక్రమ నిర్మాణాలు: స్కూల్ భూమిలో GHMC లేదా ఇతర అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే అనధికారిక నిర్మాణాలు చేపట్టారు, ఆక్రమణలకు పాల్పడ్డారు.
నివేదిక సమర్పించాలని డిమాండ్
HPS వ్యవహారాలపై సర్వే నిర్వహించి, ఆక్రమణలను తొలగించాలని, అలాగే విజిలెన్స్ కమిషనర్, స్కూల్ పరిపాలనా నిపుణులతో కూడిన స్వతంత్ర విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.
అయితే, HPS సొసైటీ తరఫు న్యాయవాది ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేస్తూ, PILను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. అయినప్పటికీ, కోర్టు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి దర్యాప్తు బాధ్యత అప్పగించింది.ముఖ్య కార్యదర్శి ఇచ్చే నివేదికపై HPS వ్యవహారాల తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications