రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్తకు వేరే మహిళతో సంబంధం: వద్దన్నందుకు భార్య తల నరికాడు

వేరే మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త భార్యపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జరిగింది. వివాహేత సంబంధం వద్దని చెప్పినందుకు అతను భార్య తల నరికాడు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వేరే మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త భార్యపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జరిగింది. వివాహేత సంబంధం వద్దని చెప్పినందుకు అతను భార్య తల నరికాడు. ఆమనగల్లు ఎస్సై ఎల్లపురెడ్ రామలింగారెడ్డి సంఘటన వివరాలు చెప్పారు.

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ప్రేమ్‌ కాలనీకి చెందిన వస్పుల పెద్దయ్య కూతురు మీసాల బాలు (26)కు నాలుగేళ్ల క్రితం అదే కాలనికి చెందిని మీసాల రాజుతో వివాహమైంది. కొంత కాలం దంపతుల మధ్య సంబంధం సజావుగానే సాగింది.

ఏడాదిన్నర కిత్రం బాలు, రాజు దంపతులకు కూతురు పుట్టింది. ఆ తర్వాత భర్త రాజుతో పాటు అత్తామామలు, మరుదులు బాలును శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వస్తున్నారు.

మరో మహిళతో ఇలా...

మరో మహిళతో ఇలా...

మీసాల రాజు ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్ట కాలనీకి చెందిన మహిళతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దానికితోడు భార్య బాలును వేధిస్తూ వస్తున్నాడు. ఇటివలే భార్యకు అక్రమ సంబంధం విషయం తెలిసింది. దాంతో ఆమె అభ్యంతరం చెబుతూ వచ్చింది. ఆ మహిళకు దూరంగా ఉండాలని భర్తకు చెబుతూ వచ్చింది.

గొడవ జరిగి....

గొడవ జరిగి....

భార్య తీవ్రంగా అభ్యంతరం చెబుతున్న క్రమంలోనే గురువారం తెల్లవారు జాము ఇరువురి మధ్య గొడవ జరిగింది. తన వివాహేతర సంబందానికి బాలు అడ్డుగా ఉందని మీసాల రాజు అప్పటికే ఆగ్రహంతో ఉన్నాడు. దాంతో భార్యను కొబ్బరి బొండాలు నరికే పదునైన కత్తితో మెడ, తలపై నరికాడు. ఆమె చనిపోయిందని భావించి పారిపోయాడు.

గాయాలతో అరుస్తుండగా...

గాయాలతో అరుస్తుండగా...

తీవ్రంగా గాయపడిన బాలు ఇంట్లో కేకలు వేస్తూ పరుగులు తీయసాగింది. దీంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కలవాళ్లు వెంటనే వచ్చారు. వారికి రక్తస్రావంతో కేకలు వేస్తు్న బాలు కనిపించింది. చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం బాలును హైదరాబాద్‌ ఉస్మానియా అసుపత్రికి తరలించారు.

మృత్యువుతో పోరాడుతున్న బాలు...

మృత్యువుతో పోరాడుతున్న బాలు...

మెడ, తలపై తీవ్రగాయాలు కావడంతో రక్తం తీవ్రంగా పోయి బాలు ఉస్మానియాలో మృత్యువుతో పోరాడుతోంది. సంఘటన స్థలాన్ని ఆమనగల్లు ఎస్‌ఐ రామలింగారెడ్డి సందర్శించారు. బాధితురాలు బాలు సోదరుడు వస్పుల గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

English summary
A person has attempted to kill his wife at Amanagallu of Rangareddy district in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X