హైదరాబాద్‌లో మరో ఘోరం: రెండో భార్యను డంబెల్తో కొట్టి చంపి, డ్రమ్ములో కుక్కాడు, ఇంటికి తాళం
హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఓ దుర్మార్గుడు రెండో భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత భార్య మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి దుస్తులు కప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే, నాలుగు రోజులు క్రితమే చంపి ఇంటికి తాళం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 2020లో మొదటి భార్యను హత్య చేసిన నిందితుడు, ఇప్పుడు 9 నెలల క్రితం వివాహం చేసుకున్న రెండో భార్యను కూడా చంపాడు.

9 నెలల క్రితమే ప్రేమ వివాహం
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రహమత్ నగర్లో నివాసం ఉండే నిందితుడు అనిల్.. సరోజను 9 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఇద్దరి మధ్య తరచూ గొడవలు తలెత్తాయి. తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి రాజీ కుదిర్చారు. నెల రోజుల క్రితమే తిరిగి సరోజను అనిల్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. శనివారం నుంచి సరోజ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చి.. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సరోజను డంబెల్‌తో కొట్టి చంపిన అనిల్.. డ్రమ్ములో కుక్కాడు
సరోజ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ ఇంటిని పరిశీలించారు. తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి ఇంటిని పరిశీలించారు. గది నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లోని డ్రమ్ములో సరోజ మృతదేహం కనిపించిది. పక్కనే డంబెల్పై ఉన్న రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు.డంబెల్తోనే సరోజ తలపై బాది హత్య చేసి.. డ్రమ్ములో పడేసి అనిల్ పారిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మొదటి భార్యను బీర్ బాటిల్‌తో కొట్టి చంపిన అనిల్..
కాగా, అనిల్‌కు పదేళ్ల క్రితమే మహబూబ్ నగర్ జిల్లా మద్దూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. 2020లో భార్యతో గొడవ పడి బీర్ బాటిల్‌తో తలపై కొట్టి చంపేశాడు. మొదటి భార్యను చంపిన కేసులో అనిల్ 2 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటికి వచ్చాడు. అనిల్ మొదటి భార్య పిల్లలు రహ్మత్ నగర్‌లోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నారు. కాగా, అనుమానంతోనే మొదటి భార్యను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత పక్క గ్రామానికే చెందిన సరోజను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సరోజ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సరోజను చంపిన కేసులో పోలీసులు నిందితుడైన అనిల్ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications