‘వ్యూహం’ సినిమా విడుదలపై హైదరాబాద్ కోర్టు స్టే: థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన 'వ్యూహం' (Vyooham) సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తాజాగా స్టే విధించింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ ఈ సినిమా విడుదలపై కోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లలో వ్యూహం సినిమా విడుదలపై హైకోర్టు గురువారం బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.

జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జారీ చేసిన సెన్సార్ బోర్డు ఉత్తర్వులను రద్దు చేసింది. వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలంటూ టీడీపీ కీలక నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తాజాగా గురువారం విచారణ జరిపింది. ఈ క్రమంలో సినిమా విడుదలకు హైకోర్టు నిరాకరించింది. జనవరి 11 వరకు సినిమాను విడుదల చేయొద్దంటూ స్పష్టం చేసింది.

Hyderabad city civil court stay on Vyooham movie release

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామానే ఈ వ్యూహాం సినిమా. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. రంగం సినిమా ఫేం అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో టీడీపీ అధినే చంద్రబాబు నాయుడును కించపరిచేలా చూపించారని ఇటీవల నారా లోకేశ్ ఆరోపించారు.

ఈ మేరకు వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల కూడా నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+