యువతకు హైదరాబాద్ సిటీ పోలీస్ అదిరే ఆఫర్.. DON'T MISS
Hyderabad City Police విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చారు. ఆధునిక పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఇంటర్న్‌షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. డిగ్రీ, పీజీ చదువుతున్న 25 ఏళ్లలోపు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టులు, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర పోలీస్ శాఖలోని SMIT సెల్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఎంపికైన విద్యార్థులకు నేర విశ్లేషణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా పోలీసింగ్, సైబర్ అవేర్‌నెస్ వంటి విభాగాల్లో పని చేసే అవకాశం కల్పిస్తారు. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

వాలంటీర్ అవకాశాలు..
కేవలం విద్యార్థులే కాకుండా ఐటీ, లా, మీడియా, సైకాలజీ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులు కూడా వాలంటీర్‌గా చేరి తమ సేవలను అందించవచ్చు. ప్రజా భద్రతకు సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనలను తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
దరఖాస్తు విధానం..
ఆసక్తి ఉన్న అభ్యర్థులు హైదరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో విద్యార్హతలు, నైపుణ్యాలు మరియు ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటారు.
ముఖ్య ప్రయోజనాలు..
పోలీస్ శాఖ పనితీరుపై ప్రత్యక్ష అవగాహన
డేటా అనాలిటిక్స్, రీసెర్చ్ స్కిల్స్ అభివృద్ధి
నెట్‌వర్కింగ్ మరియు కెరీర్ గైడెన్స్ అవకాశాలు
సైబర్ సెక్యూరిటీ, ప్రజా భద్రతపై ప్రాక్టికల్ పరిజ్ఞానం
ప్రభుత్వ రంగంలో పని అనుభవం ద్వారా రిజ్యూమ్ బలోపేతం












Click it and Unblock the Notifications