పోలీస్ వేషం చూసి మోసపోకు: ఆసక్తికర పోస్ట్ చేసిన సజ్జనార్!
ఇటీవల కాలంలో పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ కంటే సైబర్ నేరాలను కట్టడి చేయడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకునే ఘటనలు ఎక్కువవుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. ఇక అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
బాగా పెరిగిపోయిన డిజిటల్ అరెస్ట్ మోసాలు
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేస్తున్న మోసగాళ్లు తమను సిబిఐ, ఈడి, ఐటి లేదా పోలీస్ అధికారులుగా పరిచయం చేసుకుంటూ వీడియో కాల్స్ చేస్తున్నారు. మీ పేరుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, మనీ ల్యాండరింగ్ కేసులో మీ పేరు ఉందని భయపెడుతున్నారు. కేసు నమోదు కాకుండా ఉండాలంటే వెంటనే డబ్బులు ఇవ్వాలని వారి పైన ఒత్తిడి తెస్తున్నారు.

అవగాహనా వీడియో పంచుకున్న సజ్జనార్
సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడిన కొంతమంది ఉన్నత విద్యావంతులు కూడా వారు అడిగిన డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ vc సజ్జనార్ ఒక అవగాహన వీడియోను పంచుకున్నారు. పోలీసులు ఎప్పుడు వాట్సప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేయరని, డబ్బులు అడగరని, డిజిటల్ అరెస్ట్ అనే పదం చట్టంలో అసలు లేనేలేదని పేర్కొన్నారు.
పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 14, 2026
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.
దయచేసి గమనించండి...… pic.twitter.com/mzA6JNKBrk
ఆ కాల్స్ నమ్మొద్దు
ఇటువంటి కాల్స్ వస్తే ఎవరు భయపడకూడదు అని, వెంటనే కాల్ కట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ vc సజ్జనార్ తెలిపారు. అంతేకాదు అనుమానాస్పద వీడియో కాల్స్ ను నమ్మొద్దని, సమాచారాన్ని, ఓటిపి లు, బ్యాంక్ వివరాలను ఎప్పుడు ఎవరితోనూ పంచుకోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అప్పుడే సైబర్ మోసాలను అరికట్టగలుగుతామని ఆయన తెలిపారు.
జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్
దీనిపైన 1930 సైబర్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాదు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం తీసుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ అవగాహన వీడియోను షేర్ చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు అవగాహన కల్పించాలని మీ జాగ్రత్తే మీ రక్షణ అంటూ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications