సిగరెట్, వైన్ తాగుతా, పూరీ గురించి తెలియదు: ముమైత్ ఖాన్
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సిట్ విచారణలో ఐటెం సాంగ్ గర్ల్ ముమైత్ ఖాన్ పలు కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న ఆమె గురువారం సిట్ ముందు హాజరైన విషయం తెలిసిందే.
హైదరాబాద్: గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సిట్ విచారణలో ఐటెం సాంగ్ గర్ల్ ముమైత్ ఖాన్ పలు కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న ఆమె గురువారం సిట్ ముందు హాజరైన విషయం తెలిసిందే. సిట్ అధికారుల ప్రశ్నలకు ఆమె సూటిగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

సిగరెట్, వైన్ మాత్రం తాగుతా..
తనకు డ్రగ్స్ అలవాటు లేవని.. సిగరెట్, వైన్ మాత్రం తాగుతుంటానని సినీ నటి ముమైత్‌ఖాన్ సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 4.30 గంటలకు ముగిసింది. ఆరున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ముమైత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
Recommended Video


పూరీ గురించి తెలియదు..
సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్ వాడుతుండగా తాను ఎప్పుడూ చూడలేదని ముమైత్ తెలిపారు. కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ జె.హరికిషన్, ఇన్‌స్పెక్టర్లు బీఎల్ రేణుక, వి.జయలక్ష్మి, కె కరుణ ఆమెను విచారించారు.

ఈ రోజుల్లో అవి కామన్..
డ్రగ్స్ అలవాటు ఉందా, ఎలాంటి డ్రగ్స్ వాడతావని సిట్ ప్రశ్నించగా... తనకు అసలు డ్రగ్స్ అలవాటే లేదని సమాధానమిచ్చారు ముమైత్. సిగరెట్, వైన్ అలవాటున్నాయని.. ఈరోజుల్లో అవి కామన్ అని చెప్పినట్లు సమాచారం.

పూరీతో వెళ్లలేదు..
పూరీ జగన్నాథ్‌తో గోవా, బ్యాంకాక్ పార్టీలకు వెళ్లారా. అక్కడ డ్రగ్స్‌ను వినియోగించారా? గోవాలో నెలకోసారి జరిగే పార్టీల్లో డ్రగ్స్‌ను వినియోగిస్తారట కదా అని ప్రశ్నించారు. అసలు తాను బ్యాంకాక్, గోవా వెళ్లలేదని, డ్రగ్స్ గురించి తెలియదని ముబైత్ చెప్పారు. పూరి జగన్నాథ్‌తో సినిమా సంబంధాలే ఉన్నాయని, డ్రగ్స్ గురించి తెలియదని స్పష్టం చేశారు.

కెల్విన్ తెలియదు?
కెల్విన్, జీషన్ అలీతో పరిచయాలున్నాయా? అని ప్రశ్నించగా వారెవరో తనకు తెలియదన్నారు. దీంతో అధికారులు కెల్విన్ ఫోన్ కాల్ డాటాలో ఆమె నెంబర్ చూపించారు. పూరితో పార్టీలో పాల్గొన్న కొన్ని వీడియోలు చూపించారు. అయినా.. ముమైత్‌ఖాన్ తనకేమీ తెలియదన్నారు.

అవసరమైతే మళ్లీ విచారణ
తనకు డ్రగ్స్ అలవాటు లేదని ప్రూవ్ చేసుకోవడానికే విచారణకు హాజరయ్యానని.. కావాలంటే తన రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలు తీసుకోవాలని అధికారులను కోరారు. కానీ, ఇప్పుడు వాటి అవసరం లేదని, మళ్లీ పిలిచినప్పుడు అవసరమైతే తీసుకుంటామని అధికారులు చెప్పారు.

చార్మి స్క్రిప్టే చదివారా?
ముమైత్‌ఖాన్ కూడా చార్మి స్క్రిప్టునే చదవడంతో అధికారులు చేసేది లేక ఆమెను పంపేశారు. తిరిగి పుణె వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముమైత్‌ను మీడియా చుట్టుముట్టింది. సిట్ విచారణ ఎలా సాగింది? డ్రగ్స్ ఆరోపణలు ఎందుకొచ్చాయని ప్రశ్నించగా.. ‘ఎవ్రి థింగ్ ఈజ్ ఫైన్' అంటూ లోపలకు వెళ్లిపోయారు. కాగా ముమైత్‌తో పాటే మరో ఇద్దరిని విచారించారు. సాద్ నజీర్, ముబీన్ అనే వ్యక్తులను విచారించారు. వీరు గతంలో ఒక పబ్‌లో డ్రగ్స్‌ను వినియోగిస్తుండగా పట్టుబడినట్లు తెలిసింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications