Dry Day: మందు బాబులకు షాక్.. వాహనదారులకు అలర్ట్!

హైదరాబాద్‌లో శ్రీరామనవమి వేడుకలు, శోభాయాత్ర నేపథ్యంలో అటు భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఇటు శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నగరంలోని మందుబాబులకు గట్టి షాక్ తగిలింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం (మార్చి 27) నగరంవ్యాప్తంగా 'డ్రై డే' (Dry Day) పాటించాలని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మద్యం విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు) అన్ని రకాల వైన్ షాపులు, బార్లు, క్లబ్బులు మూసి ఉంచాలి. శోభాయాత్రలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Hyderabad Dry Day Today Liquor Shops to Remain Closed for 24 Hours due to Sri Rama Navami Shobha Yatra

మరోవైపు, సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే భారీ శోభాయాత్ర దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యాత్ర సాగే మార్గాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్ల వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. అలాగే మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు డైవర్ట్ చేయనున్నారు.

నగరంలోని కీలక ప్రాంతాలైన అబిడ్స్ జీపీఓ, సుల్తాన్ బజార్, కోఠి, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ మరియు కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎంజే బ్రిడ్జ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా మళ్లిస్తారు. యాత్ర సాగే సమయంలో అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయనున్నారు. వాహనదారులు ఈ మార్పులను గమనించి, పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+