మందు బాబులకు బిగ్ షాక్... హైదరాబాద్ లో రెండు రోజులు వైన్స్ బంద్
తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగ కన్నుల పండగలా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బోనాల పండగ అట్టహాసంగా సాగుతోంది. నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలతో నగరంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వాతావరణం ఉంది. గోల్కోండ, లాల్ దర్వాజ, ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లోని మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. బోనాల పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గంటల నుండి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గంటల నుండి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ బంద్
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025
13వ తేదీ ఉదయం 6:00 నుండి 15వ తేదీ ఉదయం 6:00 వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ pic.twitter.com/qKKPuaVw2S
హైదరాబాద్ లో నగరంలో ఉజ్జయిని మహింకాళీ జాతర బోనాల పండుగ సందర్భంగా శాంతి భద్రతల నేపథ్యంలో నగరంలోని వైన్స్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. బోనాల పండగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications