ఏసీబీ సోదాలు.. రూ. 100 కోట్లకుపైనే అక్రమాస్తులు కూడబెట్టిన ఏడీఈ
హైదరాబాద్ నగరంలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ రెడ్డి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఆయన నివాసంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు సదరు అధికారికి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏడీఈ నివాసంలో స్థిరాస్థి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం సతీష్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీపీవో
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుల్లురు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ నుంచి లంచం వసూలు చేసేందుకు డీపీవో శ్యామ్ సుందర్ సిద్ధమయ్యాడు. వెంచర్ మేనేజర్ నుంచి రూ. 2 లక్షల లంచం తీసుకోవాలంటూ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సూచించాడు.
వెంచర్ మేనేజర్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో పంచాయతీ సెక్రటరీ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. డీపీవో సూచన మేరకే తాను రూ. 2 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు పంచాయతీ సెక్రటరీ. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. డీపీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications