హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకా కోసం అమెరికా నుంచి కార్లు, వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, గురిచూసి కాల్చగలిగే స్పైఫర్స్

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాదులో మన వాహనాల్లో ప్రయాణించరు. ఆమె కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు విమానాలు తెప్పిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ivanka Trump Visit : వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, కనీవిని ఎరుగని సెక్యూరిటీ | Oneindia Telugu

హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాదులో మన వాహనాల్లో ప్రయాణించరు. ఆమె కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు విమానాలు తెప్పిస్తున్నారు. జనరల్ మోటార్ సంస్థ అధ్యక్షుడి ఫ్యామిలీ కోసం తయారు చేసే లీమోజీన్ వాహనాలు హైదరాబాద్ వస్తాయి.

హైదరాబాద్‌కు ఇవాంకా ట్రంప్: కలవరపెడుతున్న దోమలు, గ్రేటర్ 'ఆపరేషన్'హైదరాబాద్‌కు ఇవాంకా ట్రంప్: కలవరపెడుతున్న దోమలు, గ్రేటర్ 'ఆపరేషన్'

ఇవి అత్యాధునిక, సురక్షిత వాహనాలు. తుటాలు, మందు పాతరలతో పాటు రాకెట్ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచి కూడా ఇవి రక్షిస్తాయి. ఆధునాతన సమాచార వ్యవస్థతో చిన్నపాటి ఆఫీసులా ఉంటుంది. ఇలాంటి వాటిని మూడింటిని తీసుకు రానున్నారు.

ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు

ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు

దాదాపు అన్ని ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉంది. ముఖ్యంగా ఐసిస్, సాానుభూతిపరులు అవకాశం కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఇవాంకా కోసం హైదరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఆమె భద్రతను అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

 హైదరాబాద్ చేరిన మెనూ, అమెరికా నుంచే వంట దినుసులు

హైదరాబాద్ చేరిన మెనూ, అమెరికా నుంచే వంట దినుసులు

ఇవాంకకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు దేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై అమెరికా రాయబార కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ బృందంలో 20 మందికి పైగా వంటవాళ్లూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే విందులో తప్ప మిగతా కార్యక్రమాల్లో ఇవాంక వీరు తయారు చేసే ఆహారమే తీసుకుంటారు. అమె మెనూ ఇప్పటికే హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి చేరింది. వంటదినుసులు అమెరికా నుంచే వస్తున్నాయి.

 వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ

వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ

ఇవాంక పర్యటనను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లోని సీక్రెట్‌ సర్వీస్‌ కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఆమె పర్యటించే, పరిసర ప్రాంతాల అన్నింటి పైనా నిరంతరం నిఘా కొనసాగించనున్నారని అంటున్నారు.

 వైట్ హౌస్ నుంచి ఆదేశాలు

వైట్ హౌస్ నుంచి ఆదేశాలు

అనుకోని పరిణామాలు కనిపించినా, ఎదురైనా అమెరికా భద్రతా సిబ్బందికి శ్వేతసౌధం నుంచే ఆదేశాలు ఇవ్వనుంది. వెస్టిన్‌ హోటల్‌ సిబ్బంది వివరాలను అధికారులు సేకరించారు. ఆమె ఉన్నప్పుడు విధుల్లో పాల్గొనే వారందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చారు.

నో ఫ్లై జోన్

నో ఫ్లై జోన్

ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ, ఇవాంకా పాల్గొనే పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సుకు కనీవినీ రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానితో పాటు ఇవాంకా వస్తుండటంతో హెచ్ఐసీసీ ప్రాంగణం నుంచి విమానాలు ఎగరకుండా నిషేధం విధిస్తున్నారు.

 గురిచూసి కాల్చగలిగేలా

గురిచూసి కాల్చగలిగేలా

ఎత్తైన కొండలు ఉండంతో హెచ్‌ఐసీసీ ప్రాంగణాన్ని చూడటం ఈజీ. ఎవరైనా అవాంచిత వ్యక్తులు పరిసర ప్రాంతాల్లోకి వస్తే గుర్తించి గురిచూసి కాల్చగలిగే స్పైఫర్స్‌ను చుట్టుపక్కల ఎత్తైన ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌జీ, అక్టోపస్‌ వంటి కమెండో దళాల్లో ఉన్న స్పైనర్స్‌ను వినియోగిస్తున్నారు.

 ముఖ కవళికలు గుర్తించేందుకు పరికరాలు

ముఖ కవళికలు గుర్తించేందుకు పరికరాలు

అనుమతిలేని వారు సదస్సు జరిగే మందిరంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ముఖ కవళికలు గుర్తించేందుకు రూ.25 కోట్లతో ప్రత్యేక పరికరాలు తీసుకొస్తున్నారు. సమావేశానికి హాజరయ్యే వారి ఫోటోలను ముందుగానే తీసుకుంటారు.

పరిసరాల్లోని ప్రజలకు పాస్‌లు

పరిసరాల్లోని ప్రజలకు పాస్‌లు

మరుసటి రోజు గోల్కొండ కోటలో ప్రత్యేక విందు ఇస్తున్నారు. ఇందుకోసం పరిసరాలు గాలిస్తున్నారు. అంతేకాదు, హెచ్‌ఐసీసీ, ఫలక్‌నుమా ప్యాలెస్‌ పరిసరాల్లోని ప్రజలకు పాస్‌లు జారీ చేయనున్నారు. సదస్సు జరిగినన్నాళ్లూ, ఫలక్‌నుమాలో విందు ముగిసే వరకూ పరిసర ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఈ పాస్‌లు చూపించాలి.

English summary
Hyderabad, With less than a week left for Global Entrepreneurship Summit (GES), this Information Technology hub is getting decked up for the delegates from 150 countries, especially US President Donald Trump's daughter Ivanka Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X