హైదరాబాద్ కు ముంచుకొస్తున్న కొత్త ఉపద్రవం!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నగరంలో అడుగడుగున ట్రాఫిక్ సమస్య, డ్రైనేజీ సమస్య, దోమల సమస్య.. ఇలా రకరకాల సమస్యలు నగరవాసులను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ వాసులకు ఈ సమస్యలే కాక మరో అతిపెద్ద సమస్య కూడా వచ్చి పడింది. హైదరాబాద్ నగరవాసులు ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆందోళనతో బెంబేలెత్తిపోతున్నారు.

ఆ ప్రాంతంలో నత్తల బెడద
ఇంతకీ హైదరాబాద్ నగరవాసులు తాజాగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి.. అనే వివరాలలోకి వెళితే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో న్యూ బోయిన్ పల్లి వాసులు ఇప్పుడు కొత్త బెడదను ఎదుర్కొంటున్నారు. ఆఫ్రికన్ నత్తలు స్థానికులను భయపెడుతున్నాయి. మిలటరీకి చెందిన మూడు ఎకరాల పచ్చని వనంలో ఈ నత్తల సంఖ్య విపరీతంగా పెరిగింది.

Hyderabad has facing a new giant african snails problem this is What s happening

పచ్చని చెట్లను నాశనం చేస్తున్న నత్తలు
ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఈ నత్తలు పచ్చని ప్రకృతిని, అక్కడ ఉన్న చెట్లను నాశనం చేస్తున్నాయి. కేవలం ఆకులు, చిగుళ్ళు, కాండం, పూత, పిందె కాకుండా పెద్దపెద్ద వృక్షాలలో ఉన్న సారాన్ని కూడా పీల్చేసి అవి నేల కూలేలా చేస్తున్నాయి. దీంతో అక్కడివారు ఇళ్లలో పెట్టుకున్న మొక్కలు, చెట్లను కాపాడుకోవడానికి ఆందోళన పడుతున్నారు.

హైదరాబాద్ పార్కులు, ఇళ్ళలో మొక్కలకు బెడద
ఈ నత్తల సంఖ్య ఇదేవిధంగా పెరుగుతుంటే హైదరాబాద్ లో పార్కులు, ఇళ్ళల్లో కూడా మొక్కలు పెంచుకునే పరిస్థితి ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నత్తలు ఐదు నుంచి ఆరేళ్ల జీవితకాలం కలిగి ఉంటాయని, ఒక్కొక్క నత్త నెలకు వందల సంఖ్యలో గుడ్లు పెడుతూ వేగంగా సంతాన ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. ఈ నత్తలు పర్యావరణానికి ముప్పు అని పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నత్తల నివారణపై ఫోకస్ చెయ్యాలని సూచన
అయితే గతంలో ఇవి కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉండేవని, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోనూ, శ్రీకాకుళం జిల్లాలోనూ ఇవి రైతుల పంట పొలాలను నాశనం చేశాయని గుర్తు చేస్తున్నారు. ఇవి రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు పేర్కొన్నారు. బొప్పాయి, మిరప, ఆయిల్ పామ్ వంటి పంటలను నాశనం చేయడంతో రైతులు నష్టాలను చవి చూశారన్నారు. ఈ నత్త లను నివారించడం పైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+