వైరల్ వీడియో: నడిరోడ్డుపై ఆటో డ్రైవర్ హల్ చల్.. ఆటో నడుపుతూనే అమ్మాయితో..
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేందుకు ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. నడి రోడ్డుపై, రైలు పట్టాలపై వింత వింత విన్యాసాలు చేస్తూ వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించినవారు మరికొందరు ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. నడి రోడ్డుపై బరితెగించి ప్రవర్తించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Reckless Driving : #Hyderabad
— Surya Reddy (@jsuryareddy) November 6, 2025
This Auto Driver doing Stunts by making his girlfriend sit on his lap and Hugging him in running Auto Rickshaw.
Claiming it happened in Chaderghat, Hyderabad. Received in Whatsapp.
@SajjanarVC @CPHydCity @HYDTP @hydcitypolice #RoadSafety pic.twitter.com/CfHKVhCSz8
హైదరాబాద్ లోని పాతబస్తీలో ఓ ఆటోడ్రైవర్.. ఆటో నడుపుతూనే తన ముందు తన లవర్ ను కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేశాడు. రోడ్డుపై ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. ఈ దృశ్యాలను పక్కన వెళ్తున్న వాహనదారులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలక్ పేట్ లోని నల్గొండ చౌరస్తా నుంచి కోఠి వైపునకు ఆటోలో వెళ్తున్న ఈ జంట రోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ హల్ చల్ చేసింది. యువకుడు ఆటో నడుపుతుండగా.. యువతి అతనికి ఎదురుగా రోడ్డు కనబడ కుండా కూర్చొంది. యువకుడు ఆమెతో రొమాన్స్ చేస్తూనే ఆటో నడిపాడు. ఆటో చాదర్ ఘాట్ బ్రిడ్జ్ పైకి వచ్చిన సమయంలో పక్కనే ఉన్న వాహనదారులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. వీడియోలను నెట్టింట పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి.

వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు దృష్టి పెట్టారు. చాదర్ ఘాట్ ప్రాంతంలో సీటీటీవీ ఫూటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఆటో నల్గొండ రిజిస్ట్రేషన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications