హైదరాబాద్ సిటీకి మరో గౌరవం: లక్క గాజులకు జీఐ ట్యాగ్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (Geographical indication) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కంట్రోలర్​ జనరల్​ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ ​మార్క్స్​ గుర్తింపును మంజూరు చేసింది.​ ఇదివరకే హైదరాబాద్‌ హలీమ్‌కు(Hyderabad Haleem) జీఐ ట్యాగ్‌ దక్కగా, తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరడం విశేషం.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ బేంగిల్స్‌ను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా, ఈ లక్క గాజులకు చెన్నైలోని సెంట్రల్ గవర్నమెంట్ జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్‌ ట్యాగ్‌ను ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జీఐ ట్యాగ్‌ అందుకున్న 17వ ఉత్పత్తిగా లక్క గాజులు చోటు దక్కించుకున్నాయి.

Hyderabad Laad Bazar s lac bangles are now at a trademark gets Geographical Indication tag

కాగా, హైదరాబాద్‌ నగరంలో పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. ఇక్కడ వివిధ రకాల గాజులు తయారవుతుంటాయి. అందులో లక్క రాళ్ల గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ గాజుల తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైనది. రెసిన్‌ పదార్ధాన్ని కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. ఆ తర్వాత దీన్ని వృత్తాకారంలో మలిచి, దానిపై రాళ్లు, పూసలు, స్ఫటికాలు, అద్దాలను హస్తకళాకారులు చేతులతోనే అందంగా తీర్చిదిద్దుతారు.

అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా గాజుల డిజైన్లలో చాలా మార్పులొచ్చాయి. మొఘల్ వంశస్థుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెబుతుంటారు. రాజ కుటుంబాల్లోని మహిళలు ఈ గాజులను విరివిగా ధరించేవారు. ఇప్పుడు వేడుకల్లో వీటిని ధరించడానికి మహిళలు ఇష్టపడుతున్నారు. లాడ్‌ బజార్‌లో మాత్రమే దొరికే ఈ లక్క గాజులకు జీఐ గుర్తింపు కోసం 2022లో క్రిసెంట్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ ఆర్టిజన్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ దరఖాస్తు చేసింది. దీనికి తోడుగా తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది. ఈ నేపథ్యంలో 18 నెలల పరిశీలన తరవాత జీఐ ట్యాగ్‌ మంజూరైంది. త్వరలోనే ధ్రువీకరణ పత్రం రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+