Hyderabad Lok Sabha Election 2024 Results LIVE:ఓవైసీ కోటను మాధవీలత కూల్చగలదా..?
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు:దేశంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నగరంలో దేశ నలమూలల నుంచి వచ్చిన వారు జీవనం సాగిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తూ ఈ నగరాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నింది.అయితే 2024 జూన్ 2వ తేదీతో హైదరాబాద్ ఒక్క తెలంగాణకే రాజధానిగా పరిమితమైంది.ఇక ఈ నగరంలో భిన్న సంస్కృతులు కనిపిస్తాయి. రాజకీయంగా కూడా హైదరాబాద్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ముఖ్యమైన లోక్‌సభ స్థానం హైదరాబాద్.2008లో హైదరాబాద్ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మలక్‌పేట్, కార్వాన్,గోషామహల్,చార్మినార్,చాంద్రాయణగుట్ట,యాకుత్ పురా,బహదూర్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి.1984 నుంచి ఇప్పటి వరకు ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇతేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తోంది.1984 నుంచి 1999 వరకు ఎంఐఎం వ్యవస్థాపకులు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉండగా 2004 నుంచి 2019 వరకు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా గెలుస్తూ వచ్చారు.
ఇక 2019లో అసదుద్దీన్ ఓవైసీ 2,82,187 ఓట్ల మెజార్టీతో గెలవగా..2014లో 202,454 ఓట్లతో,2009లో 1,13,865 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2024లో తన ప్రత్యర్థిగా మాధవీలత బరిలో నిలిచారు. మాధవీలత అనతి కాలంలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన హావభావాలతో దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా చేశారు.
ఇక ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు చాలామంది ఫిదా అయ్యారు. అయితే ఓవైసీని ఎంతమేరకు ఆమె ప్రతిఘటిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీనివ్వగా.. పోటీ మొత్తం బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ మధ్యే సాగింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఓవైసీకే మొగ్గు చూపాయి.












Click it and Unblock the Notifications