షాకింగ్, పెళ్లైన భర్త మాయం: పోస్ట్‌లో 'తలాక్', రెండో పెళ్లి అని తేలింది
పెళ్లిన ఒక్క రోజులోనే భర్త పోస్టు కార్డ్‌తో మూడుసార్లు తలాక్ చెప్పిన సంఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వయస్సు 38. బాధితురాలి వయస్సు 26. ఒక్కరోజులోనే తలాక్ చెప్పి భార్యను మోసగించాడ
హైదరాబాద్: పెళ్లిన ఒక్క రోజులోనే భర్త పోస్టు కార్డ్‌తో మూడుసార్లు తలాక్ చెప్పిన సంఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వయస్సు 38. బాధితురాలి వయస్సు 26. ఒక్కరోజులోనే తలాక్ చెప్పి భార్యను మోసగించాడు.
దీంతో ఆ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెళ్లయిన మరుసటి రోజే కనిపించకుండా పోయి పోస్టులో 'తలాక్ తలాక్ తలాక్' అని ఉత్తరం రాసి భార్యతో విడాకులు తీసుకున్నాడు.
దేశ వ్యాప్తంగా తలాక్‌పై విస్తృతంగా చర్చ జరుగుతుండడం, మరోవైపు సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

కూకట్‌పల్లి బస్తీకి చెందిన మహమ్మద్ హనీఫ్ మార్చి 10న యాకుత్‌పురా తలాబ్‌కట్టకు చెందిన ఫర్హీనా బేగంను వివాహం చేసుకున్నాడు. అప్పటికే అతనికి పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మగబిడ్డ లేడని ఫర్హీనాబేగంను రెండో వివాహం చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న రోజే కూకట్‌పల్లిలో ఓ అద్దెగదిలో కాపురం పెట్టాడు. రాత్రికి అక్కడే ఉన్న హనీఫ్ మరుసటి రోజు తెల్లవారుజామున భార్యకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఫోన్ చేసి అడగ్గా తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు.
ఒంటరిగా ఉన్న భార్యను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని సూచించాడు. ఫర్హీనా బేగం అత్తారింటికి వెళ్లడంతో హనీఫ్‌కు ముందే పెళ్లైన విషయం బయట పడింది. భర్తను నిలదీసింది. దీంతో ఆరోజు నుంచి హనీఫ్ ఇంటికి రావడం మానేశాడు.
మరో వైపు ఫోన్ ద్వారా వేధింపులు మొదలయ్యాయి. దీంతో తనకు రాసిన లేఖను తీసుకుని బాధితురాలు భవానీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోసం చేసిన హనీఫ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications