వీడి అసాధ్యం గూల.. తనకు తానే ఏసీపీ, డీఎస్పీ పదవులు ఇచ్చుకున్న కేటుగాడు!
హైదరాబాద్ పోలీసులు నకిలీ పోలీసు ఆట కట్టించారు. పోలీసు ఉన్నతాధికారిగా చెలామణి అవుతున్న కేటుగాన్ని అరెస్ట్ చేశారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన నిందుతుడి పోలీసు అవతారం ఎత్తాడు. ఏసీపీ, డిఎస్పీ పేరుతో నకిలీ ఐడీ కార్డులు సృష్టించి మోసాలకు పాల్పడుతూ చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.
గోదావరి ఖనికి చెందిన ఎంవీ రవిచంద్ర సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో నకిలీ పోలీసు అవతారం ఎత్తి మోసాలకు తెరతీశాడు. వెస్ట్ జోన్ ఏసీపీనంటూ నమ్మిస్తూ వసూళ్లకు పాల్పడ్డాడు. రవిచంద్రపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పోలీసు ఆటకట్టించారు.

పోలీసు అవతారమెత్తి మోసాలకు పాల్పడుతున్న రవిచంద్రను అరెస్ట్ చేసిన పోలీసులకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. డీఎస్పీ రవిచంద్ర పేరుతో ఉన్న ఐడీ కార్డుతో పలువురిని మోసం చేసినట్లు తెలుసుకుని విస్తుపోయారు. నిందితుని వద్ద నుంచి ఫేక్ ఐడీ కార్డులతో పాటు మరికొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ డీఎస్పీ ఐడీ కార్డు సాయంతో రవిచంద్ర సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు విచారణలో తేలింది. నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు రవిచంద్ర మోసాలపై ఆరా తీస్తున్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications