ఓవైపు హైదరాబాద్ లో వర్షాలు.. మరోవైపు ఐఎండీ vs తెలంగాణ వెథర్ మెన్స్ ..
ఆకస్మిక వర్షాలు, వరదలతో హైదరాబాద్ మహా నగరం అట్టుడుకుతోంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ(IMD) హైదరాబాద్ శాఖపై ఎక్స్ వేదికగా పలువురు వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు మండిపడ్డారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలోని ప్రజలకు IMD రాడార్ అందుబాటులో లేకుండా చేయడాన్ని తప్పుబడుతున్నారు పలువురు వెదర్‌మ్యాన్లు. హైదరాబాద్ నగరానికి రాడార్ సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనిపై స్పందించిన ఐఎండీ.. మళ్లీ తిరిగి ప్రజలకు సేవలు అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్ రాడార్ సేవలను ప్రజలకు బంద్ పెట్టారని ప్రముఖ వాతావరణ నిపుణుడు తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ యూజర్ బాలాజీ ఆరోపణలు చేశారు. ఆగస్టు 7 న హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. దీనికి సంబంధించిన రాడార్ సేవలు పూర్తిగా నిలిపివేసింది ఐఎండీ అని బాలాజీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అలాగే గత రెండు మూడు రోజులుగా రాడార్ పనిచేయడం లేదని పలువురు నెటిజన్లు సైతం హైదరాబాద్ వాతావరణ శాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశారు. అయితే ఇదే విషయంపై తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ స్పందించింది. ఈ మేరకు తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం ఒక ప్రకటన విడుదల చేశారు.
Now finally
— Telangana Weatherman (@balaji25_t) August 8, 2025
IMD gave access of the radar to the public. This will help the public now. Thank you everyone for raising this issue to higher authorities
Hopefully they don't make it inaccessible again in the future 👍 https://t.co/XtDzxXfLIO
మా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే, కొందరు వ్యక్తులు తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ.. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఉద్దేశపూర్వకంగా నిన్న (గురువారం) భారీ వర్షాలు పడుతున్న సమయంలో మా వెబ్‌సైట్‌లో రాడార్ చిత్రాలను ఉద్దేశపూర్వకంగా అప్‌లోడ్ చేయడం నిలిపివేశామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఐఎండీ అనేది భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక వాతావరణ సంస్థ, ఇది స్థిరమైన మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యకలాప విధానాల ప్రకారం పనిచేస్తోందని, వాటిని ఎప్పటికీ ఉల్లంఘించదు. నిన్న భారీ వర్షాలు పడుతున్న తీవ్ర వాతావరణ పరిస్థితులు సమయంలో మా రాడార్ పూర్తిగా పనిచేస్తోంది. అయితే, ఆ సమయంలో (ఆగస్టు 6 తేదీ నుంచి) కమ్యూనికేషన్ లోపం కారణంగా మా రాడార్ ఉత్పత్తులను వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేయలేకపోయాం.
IMD has now deleted the comment that it kept earlier this morning 🫣🧐 pic.twitter.com/WX1tEWtlfB
— Telangana Weatherman (@balaji25_t) August 8, 2025
అయినప్పటికీ, మా కార్యాలయం నుంచి ప్రత్యక్ష రాడార్ చిత్రాలతో కూడిన హెచ్చరిక బులెటిన్లను మేము నిరంతరంగా విడుదల చేస్తూనే ఉన్నాం. అని ఓ ప్రకటన విడుదల చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం.












Click it and Unblock the Notifications