యువతిపై 3రోజులపాటు రేప్: పీఎస్ వద్ద మద్యం తాగుతూ రౌడీ షీటర్ వీరంగం
Recommended Video

హైదరాబాద్: యువతిపై మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన రౌడీ షీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు శుక్రవారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన ఆ రౌడీ షీటర్ పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశాడు. మూడు గంటలపాటు ముప్పు తిప్పలు పెట్టాడు.

యువతిపై 3రోజులపాటు
ఏసీపీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన రౌడీ షీటర్ షేక్ అమీర్(26)కు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంగన్ వాడీ కేంద్రంలో పనిచేస్తున్న.. తన ఇంటికి సమీపంలో ఉండే యువతి ఇంట్లో చొరబడిన అమీర్.. ఆమెపై మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.

భయంతో బాధితురాలు
కాగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి తల్లిని తీవ్రంగా కొట్టాడు. అతనికి భయపడి ఇంట్లోనే కుమిలిపోతున్న బాధితురాలికి స్థానికులు ధైర్యం చెప్పి, గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పీఎస్‌కు మద్యం తాగుతూ వచ్చి..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అమీర్ పరారీలో ఉండటంతో అతని బావను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అమీర్.. పూటుగా మద్యం సేవించి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. చేతిలో గ్లాసు పట్టుకుని మద్యం తాగుతూ.. పోలీసులను దుర్భాషలాడాడు.

గొంతుకోసుకుంటానంటూ.. ఎట్టకేలకు
అంతేగాక, బ్లేడుతో చేయి కోసుకున్నాడు. తనను అరెస్ట్ చేస్తే గొంతు కోసుకుంటానని బెదిరింపులకు దిగారు. మూడు గంటలపాటు ముప్పుతిప్పలు పెట్టిన అమీర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించిన అనంతరం అతడ్ని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications