Hyderabad: డ్రగ్స్ పట్టివేతలో చేతివాటం చూపిన ఎస్సై రాజేందర్ అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ పట్టివేతలో తన చేతివాటం చూపిన ఎస్సై రాజేందర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం(సీసీఎస్)లో రాజేందర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. నిందితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1750 గ్రాముల వరకు దాచిపెట్టి అమ్మేందుకు ఎస్ఐ ప్రయత్నించారు.
ఈ వ్యవహారంపై హైదరాబాద్ నగరంలోని నార్కోటిక్ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందడంతో వారు వలపన్ని రాజేందర్‌ను అతడి ఇంట్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్ విభాగం అధికారులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్ న్యాబ్) డైరెక్టర్, సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక ఇచ్చారు.

అనంతరం నిందితుడు రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన రాయదుర్గం ఎస్ఐగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టారు.
అప్పట్లో రాజేందర్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ఆ ఉత్తర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత సైబరాబాద్ సీసీఎస్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టుబడిన డ్రగ్స్ ను విక్రయిస్తూ మరోసారి నిందితుడిగా పట్టుబడ్డాడు.
సైబరాబాద్ కమిషనరేట్‌లో పని చేస్తున్న రాజేందర్ ఫిబ్రవరి నెలలో సైబర్ నేరంలో భాగంగా ముంబయి వెళ్లారు. అక్కడ సైబర్ మోసానికి పాల్పడిన నైజీరియన్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో నైజీరియన్ వద్ద ఉన్న 1,750 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్సై రాజేందర్ గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకుని ఇంట్లో దాచాడు.
అనంతరం ఆ మాదకద్రవ్యాలను విక్రయించేందుకు రాజేందర్ ప్రయత్నించాడు.
రాష్ట్ర నార్కోటిక్ విభాగం పోలీసులకు సమాచారం అందడంతో నార్కోటిక్ విభాగం పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో ఉండే రాజేందర్ ఇంట్లో దాడి చేసి.. రూ.80 లక్షల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications