అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్.. కుటుంబానికి బెదిరింపు కాల్
క్లీవ్‌లాండ్/హైదరాబాద్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన హైదరాబాద్ నగరానికి చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లీవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ అభ్యసిస్తున్నాడు. అయితే, తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం తెలిపారు.
అబ్దుల్‌ను కిడ్నాప్ చేశామని, 1200 డాలర్లు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారని.. లేనిపక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. తాము అందుకు అంగీకరించి.. అబ్దుల్ వాళ్ల ఆధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపమని కోరామన్నారు. అయితే, దీనికి కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. ఫోన్ పెట్టేశారని, మళ్లీ కాల్ చేయలేదని తెలిపారు.

అయితే, కిడ్నాపర్ మాట్లాడటానికి ముందు ఫోన్లో ఏడుపు వినిపించిందని అబ్దుల్ తండ్రి చెప్పారు. తమకు బెదిరింపు కాల్ వచ్చిన నెంబర్‌ను అమెరికాలోని తమ బంధువులకు పంపి.. క్లీవ్ ల్యాండ్ పోలీసులకు అందజేయాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, అబ్దుల్ అదృశ్యమైన విషయంపై అతడి బంధువులు మార్చి 8వ తేదీనే క్లీవ్ ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఒక లుకౌట్ నోటీసు జారీ చేశారు.
మరోవైపు, అబ్దుల్ కుటుంబసభ్యులు 18వ తేదీన చికాగోలోని భారత దౌత్య కార్యాయాన్ని సంప్రదించారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై క్లీవ్ ల్యాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడితో చివరిసారిగా మార్చి 7వ తేదీన మాట్లాడినట్లు ఓ పత్రికతో అబ్దుల్ తల్లి తెలిపారు.
ఇది ఇలావుండగా, ఇటీవల అమెరికాలోని చికాగోలో హైదరాబాద్ కు చెందిన విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. సయ్యద్ ఇండియానా వెస్లయన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అక్కడ భారత దౌత్య కార్యాలయం అతడికి అవసరమైన అందించింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications