హాట్ సమ్మర్ లో ఈ కూల్ ప్రదేశాలను చుట్టేయండి.. హైదరాబాద్ కు దగ్గరలోనే..
ఏప్రిల్, మే నెలలో ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్ నుంచి తప్పించుకునేందుకు నగర వాసులు విమాన టికెట్లు బుక్ చేసుకుని హిల్ స్టేషన్స్ కు బయల్దేరుతున్నారు. అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత కొన్ని పర్యటక ప్రాంతాలు దాగి ఉన్నాయి. హిడెన్ జెమ్స్ గా వీటిని పిలుస్తున్నారు. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి కేవలం 200 కిలోమీటర్ల లోపు ఈ ప్రాంతాలు ఉన్నాయి.
భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మనదేశం ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు నెలవుగా ఉంది. అటు హిమాలయ పర్వతాల నుంచి కన్యాకుమారి వరకు అలాగే జైసల్మేర్ ఎడారులు, ఇసుక దిబ్బల నుంచి కేరళలోని బ్యాక్ వాటర్ అందాల వరకు దేశంలోని ప్రతి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆహ్వానిస్తున్నాయి. అయితే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న టూరిస్టు ప్రాంతాల గురించి తెలుసా..?
గొట్టం గుట్ట ప్రాంతం.. దీన్ని మిని కాన్యాన్ గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చంద్రంపల్లి డ్యామ్ బ్యాక్ వాటర్ జలాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇక్కడి చల్లని గాలులు పర్యటకులను మైమరిపింపజేస్తుంటాయి. ఇక సాయంత్రం సూర్యాస్తమయం వేళల్లో ఇక్కడి దృశ్యాలు ఫోటోగ్రఫీకి అనుకూలంగా ఉంటాయి.
ఇక పోచారం వన్యమృగ సంరక్షణ ప్రాంతం హైదరాబాద్ నుంచి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటీవలికాలంలో నగర వాసులకు ఇదో మంచి పిక్నిక్ స్పాట్ గా మారింది. ఇక్కడి దట్టమైన చెట్లు ఫ్యామిలీతో పిక్నిక్ కు వెళ్లడానికి అనువైనదిగా ఉంటుంది. ఇక ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రం నుంచి జింకలు, ఇతర జంతువులు, పక్షులు సరస్సు వద్దకు వస్తుంటాయి. పర్యటకులు ఎంచక్కా వాటిని వీక్షించవచ్చు.
హైదరాబాద్ కు 90 కిలోమీటర్ల దూరంలో రాచకొండ కోట ఉంది. ఈ కోటను 14వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడి ఎత్తయిన రాతి కట్టడాలు ట్రెక్కింగ్ చేసేవారికి, పర్యటకులు చల్లగా సేద తీరేందుకు హాయిగా ఉంటుంది. అలాగే సింగూర్ డ్యామ్ అందాలు చూడాలంటే హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మంజీరా నదిపై ఉన్న ఈ భారీ రిజర్వాయర్ వేసవిలో పర్యటకులు బోట్ షికారు చేసేందుకు అనువైన ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడికి సమీపంలోని లోటస్ టెంపుల్ ప్రశాంతతకు మారుపేరుగా చెబుతారు.

ఇక చివరగా మల్లెల తీర్థం జలపాతం అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంటుంది. ఈ ప్రాంతం వేసవిలో బయటకు వెళ్లడానికి అనువైన ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడి జలపాతం నుంచి వచ్చే నీటి తుంపర్లు వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా, చల్లగా మారుస్తాయి.
-
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!!












Click it and Unblock the Notifications