భార్యతో శృంగారాన్ని 'లైవ్'లో: ఆ టెక్కీని పట్టుకోవడానికి ఆరు నెలలు!..

మొత్తం వీడియోలో ఎక్కడా తన ముఖం కనిపించకుండా కేవలం భార్య ముఖమే కనిపించేలా అతను జాగ్రత్తలు తీసుకున్నట్లు ఏసీపీ జయరామ్ అన్నారు.

హైదరాబాద్: పోర్న్ చిత్రాలకు బానిసగా మారిన ఓ టెక్కీ కట్టుకున్న ఇల్లాలి పరువునే బజారుకీడ్చాడు. అతగాడి తీరు తెలిసినా.. సర్దుకుపోయి కాపురాన్ని నెట్టుకొస్తున్న ఆ ఇల్లాలు భర్త నుంచి ఇంతటి షాక్ ఎదురవుతుందని ఊహించలేదు. తీరా భర్తే తనను మోసం చేశాడని తెలిసి తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది.

హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఓ టెక్కీ.. భార్యతో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. పోర్న్ చిత్రాలు విపరీతంగా చూసే అలవాటున్న అతగాడిని భార్య పలుమార్లు హెచ్చరించినా లాభం లేకపోయింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య ఓరోజు తీవ్ర వాగ్వాదం జరగ్గా.. ఇకనుంచి మారిపోతానని చెప్పాడు. చెప్పినట్లుగా నటించడం మొదలుపెట్టాడు.

Hyderabad techie live-streams sex with wife on porn site, arrested

భర్త నిజంగానే మారిపోయాడనుకున్న భార్యకు ఊహించని రూపంలో ఆపద ఎదురైంది. ఏకంగా తన పరువునే దిగజార్చే ప్రయత్నం చేశాడు భర్త. ఇద్దరు ఏకాంతంగా కలిసి ఉన్న క్షణాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఓ అశ్లీల చిత్రాల సైట్లో ప్రసారం చేశాడు. అది కాస్త పలువురి చేతులు మారి పలు పోర్న్ సైట్లలో దర్శనమిచ్చింది. చివరకు సన్నిహితులు ఇచ్చిన సమాచారంతో ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించింది.

అయితే కేసును చేధించడానికి పోలీసులకు చాలా సమయమే పట్టింది. దాదాపు ఆరు నెలలకు గానీ ఈ కేసులో అసలు నిందితుడెవరో తేలలేదు. బాధిత మహిళ భర్తకు చెందిన బ్యాంకు లావాదేవీల వివరాలు, అతని ల్యాప్ టాప్ లోని బ్రౌజింగ్ హిస్టరీని పరిశీలించిన పోలీసులు అతడే నిందితుడు అని ధ్రువీకరించారు. డబ్బుల కోసమే భార్యతో కలిసి ఉన్న వీడియోను అతగాడు లైవ్ ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

భార్యకు అనుమానం రాకుండా ల్యాప్ టాప్ లో సినిమా ప్లే చేస్తూ ఆమె దృష్టి మరల్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు, మొత్తం వీడియోలో ఎక్కడా తన ముఖం కనిపించకుండా కేవలం భార్య ముఖమే కనిపించేలా అతను జాగ్రత్తలు తీసుకున్నట్లు ఏసీపీ జయరామ్ అన్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+