పోలీస్‌స్టేషన్‌లో యువతి, టెక్కీ వీరంగం: బూతులు తిట్టి, కానిస్టేబుల్‌పై దాడి(వీడియో)
హైదరాబాద్: అర్ధరాత్రి తప్పతాగి పక్కింటి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కాగా, వారిని విడిపించడం కోసం వచ్చిన స్నేహితులు పోలీసులతో గొడవపడి పోలీస్‌స్టేషన్‌లో దాడికి తెగపడింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేపీహెచ్‌బీ కాలనీ సీఐ శ్రీకాంత్‌గౌడ్ కథనం ప్రకారం... హైదర్‌నగర్ డివిజన్‌లోని నందమూరి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని పెంట్‌హౌజ్‌లో నివసిస్తున్న శివ.. సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మార్చి 12న రాత్రి తన స్నేహితుడు కౌశిక్‌తో కలిసి ఆర్ధరాత్రి వరకు మద్యం సేవించాడు.

ఈ క్రమంలో తాగిన మద్యం సీసాలను పక్క ఇంటిపై పడేయడంతో వారి రేకులు పగిలిపోయాయి. దీంతో వారు శివ, కౌశిక్‌తో గొడవపెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి శివ, కౌశిక్‌ను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అయితే, అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న శివ, కౌశిక్‌ను విడిపించుకోవడానికి వారి మిత్రులైన తరుణ్, ప్రియాసింగ్ వచ్చి వీరంగం సృష్టించారు. తన మిత్రులను ఎలా అరెస్ట్ చేస్తారంటూ బూతులు తిట్టారు. తాము బాగా ధనవంతులమని బెదిరింపులకు గురిచేశారు. అంతేగాక, ఓ కానిస్టేబుల్‌పై దాడికి దిగారు.
WATCH: Girl creates ruckus at a Police station in Kukatpally (Telangana) (Amateur video: March 14)https://t.co/8qvohR5gKt
— ANI (@ANI_news) March 15, 2016
పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నీచర్‌ను కిందపడేసి హంగామా చేశారు. తరుణ్ సాఫ్ట్‌వేర్ రంగంలో వ్యాపారవేత్త కాగా, ప్రియాసింగ్ ఇంటర్ పూర్తి చేసింది. దీంతో మార్చి 12న ఈ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. నిందితులు చేసిన హంగామా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా, ప్రియా సింగ్, తరుణ్ కాబోయే భార్యాభర్తలుగా సమాచారం.












Click it and Unblock the Notifications