అశ్లీల నృత్యాలు: ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్‌ను బేగంపేట ఎక్సైజ్ పోలీసులు మూసివేయించారు. ఇటీవల బార్లో అశ్లీల నృత్యాలు చేస్తుండగా 30 మంది అమ్మాయిలతో పాటు 60మంది కస్టమర్లని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా, ఆ బార్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి లైసెన్సును రద్దు చేయించారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బార్స్, రెస్టారెంట్లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఇటీవల బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్ల పేరిట చట్టవ్యతిరేక వ్యాపారాలు మొదలెట్టి అమ్మాయిలను వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు. డబ్బుపై మక్కువతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా బార్లు, రెస్టారెంట్లు, స్పా సెంటర్లు వంటి వ్యాపారాలను నడుపుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు, నిరుద్యోగులకు డబ్బు ఆశ చూపించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తనిఖీలను ముమ్మరం చేశారు.
లైసెన్సు లేకుండా బార్లు నడిపినా, అమ్మాయిలను ఇలాంటి వ్యాపారాలకు ఉపయోగించినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, లైసెన్సు రద్దు చేస్తున్నారు. ఇటీవల పోలీసులు వ్యభిచార ముఠాల గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications