హైదరాబాద్‌కు జలగండం..భయపెడుతోన్న భవిష్యత్తు.. సాక్ష్యమిదే!

హైదరాబాద్ నగరంలో నీటి సమస్య ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది. సాధారణంగా వేసవిలోనే కనిపించే ట్యాంకర్ల రద్దీ ఈసారి అక్టోబర్‌లోనే మొదలైంది. జలమండలి చరిత్రలోనే తొలిసారిగా అక్టోబర్ నెలలో 2.2 లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యాయి. గతేడాది ఇదే నెలలో కేవలం 87 వేలు మాత్రమే బుక్ కావడం గమనార్హం. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లంతో ఇప్పటికే రోజుకు 7 వేలకు పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. ఇది వేసవి సీజన్‌లోనే కనిపించే స్థాయి.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గింది. భూగర్భజలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, టీఎన్‌జీఓఎస్ కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ప్రతిరోజు 250 నుంచి 300 ట్యాంకర్లు వరుసలు కడుతున్నాయి. వర్షాకాలంలో సాధారణంగా రోజుకు 1500 నుంచి 2000 ట్యాంకర్లు మాత్రమే బుక్ అయ్యేవి.

Hyderabad water crisis Tanker Bookings Hit Record 2 2 Lakh in October Like Peak Summer future fear

ఇప్పుడు ఆ సంఖ్య మూడు నాలుగు రెట్లు పెరిగింది.అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. నల్లాల నీరు సరిపోకపోవడం, బోర్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు ప్రతిరోజు ట్యాంకర్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జలమండలి అధికారులు డిమాండ్‌ను తీర్చేందుకు అదనపు ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో డెలివరీకి రెండు మూడు రోజులు పడుతోంది.

ప్రైవేట్ ట్యాంకర్ల ధరలు కూడా పెరిగాయి. కొన్ని చోట్ల రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది.ఈ పరిస్థితి కేవలం ప్రస్తుతానికే పరిమితం కాదు. నిపుణులు, అధికారులు వచ్చే నెలల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సింగూరు, మంజీరా వంటి రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. వర్షపాతం లోటు కొనసాగితే డిసెంబర్ నుంచి పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా మూడు రోజులకు ఒకసారి అనే స్థాయికి చేరుకుంది. నగర అవసరాలు రోజుకు 735 మిలియన్ గ్యాలన్లు ఉండగా, ప్రస్తుతం సరఫరా అంతకంటే తక్కువగా ఉందని అంచనాలు చెబుతున్నాయి. ప్రజలు ఇప్పటి నుంచే నీటిని ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణాల్లో ట్రీటెడ్ వాటర్ వాడకం, బోర్లపై ఆధారపడటం తగ్గించడం, రైన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి చర్యలు అవసరం.

కరవుపై ప్రత్యేక అసెంబ్లీ.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే!
కరవుపై ప్రత్యేక అసెంబ్లీ.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే!

జలమండలి కూడా అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ట్యాంకర్ల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అయినా అక్టోబర్‌లోనే ఇంత డిమాండ్ రావడం నగర భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. వేసవి రాకముందే జలగండం మొదలైంది. ఇక ముందు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+