రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి
మాస్కో/హైదరాబాద్: రష్కా - ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్ అఫ్సాన్(30) అనే వ్యక్తి చనిపోయాడు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు బుధవారం వెల్లడించారు.
కాగా, రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 నుంచి 30 మంది భారతీయులను, సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది.

రష్యా సైన్యంలో ప్రస్తుతం ముగ్గురు హైదరాబాదీలు ఉన్నారు. ఈ ముగ్గురిని భారత్‌కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భారత విదేశాంగ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఈ విషాద చోటు చేసుకుంది.
This is truly sad and sickening
— KTR (@KTRBRS) March 6, 2024
My wholehearted condolences and sympathies to the family of Mohammed Afsan who is from Hyderabad
Appeal to Union Govt to help such youngsters who’ve been duped and caught in this tragic situation by bringing them back https://t.co/ZtRj7EMqCz
మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారులు హైదరాబాద్ యువకుడి మరణాన్ని ధృవీకరించారు. కాగా, మహ్మద్ అఫ్సాన్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం కోసం అతడి కుటుంబం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని సంప్రదించింది. మరోవైపు, అఫ్సాన్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఎక్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. మృతుడు అఫ్సాన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత యువకులను రప్పించాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
చైనాకు బిగ్ షాక్.. భారత్‌కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications