ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లో హైదరాబాదీ బిర్యానీ..!
హైదరాబాదీ బిర్యానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్‌ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. మన బిర్యానీ రుచి, సువాసన, ప్రత్యేక వంట విధానం దీన్ని స్పెషల్ గా నిలుపుతోంది. ఇప్పుడు అదే బిర్యానీకి అంతర్జాతీయ వేదికపై మరో గొప్ప గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత ఆన్‌లైన్ ఫుడ్ & ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' ప్రకటించిన World's Best Rice Dishes - 2025 జాబితాలో హైదరాబాదీ బిర్యానీ సగర్వంగా టాప్ 10లో స్థానం సంపాదించింది.
టాప్ 10లో నిలిచిన ఏకైక భారతీయ వంటకం..
కాగా టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్ జాబితాలో భారత్ నుండి చోటు దక్కిన ఒకే ఒక్క వంటకం హైదరాబాదీ బిర్యానీ కావడం గమనార్హం. అంతేకాకుండా 10వ స్థానంలో నిలవడం భారతీయ వంటకాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ ర్యాంకింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత చెఫ్‌లు, ఫుడ్ క్రిటిక్స్, పర్యాటకులు, కులినరీ నిపుణులు అందించిన రివ్యూలు, రేటింగ్స్‌ను ఆధారంగా తీసుకున్నారు.

జపనీస్ వంటకాల ఆధిపత్యం..
ఈ జాబితాలో జపాన్‌కు చెందిన రైస్ వంటకాలే ఎక్కువగా నిలిచాయి. నంబర్ 1 స్థానంలో Negitoro Don ఉండగా, దాని తర్వాత కూడా సుషీ, కైసెన్డాన్ వంటి జపనీస్ వంటకాలే మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. Negitoro Don వంటకంలో ఫ్యాటీ మిన్స్డ్ ట్యూనా (టోరో), కట్ చేసిన నెగి ఉల్లిపాయలు, వెచ్చని జపాన్ రైస్ పై సర్వ్ చేసి ఇస్తారు.
భారత్‌లో లక్నో, కశ్మీరీ, కోల్‌కతా వంటి ఎన్నో ప్రసిద్ధ బిర్యానీలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ వెనక్కి నెట్టి హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలిచింది. అంతటి పోటీలో కూడా హైదరాబాదీ బిర్యానీ 10వ స్థానాన్ని కైవసం చేసుకోవడం దాని ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి రుజువు చేసిందని అంటున్నారు. ఇదే జాబితాలో ఇరాన్‌కు చెందిన మరో బిర్యానీ వంటకం కూడా స్థానం సంపాదించడం ఆసక్తిగా మారింది. ఇక హైదరాబాద్ బిర్యానీ దేశంలోని ఇతర ప్రాంతాలలో తయారయ్యే బిర్యానీలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో మాంసం, బియ్యాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి వండుతారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications