హైదరాబాద్ హాస్టల్స్ లో 'ఓయో' ట్రెండ్..? ఒకే రూమ్ లో అమ్మాయి.. అబ్బాయి
కాలం మారుతోంది. హైదరాబాద్ మహా నగరం విశ్వ నగరంగా, ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. అలాగే కొత్త కొత్త సంస్కృతులు, ట్రెండ్ లు నగరంలో పెరుగుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే రూమ్ లో ఉండటం ఇప్పుడు నయా ట్రెండ్. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కో- లివింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కో- లివింగ్ హాస్టల్ లు వందల సంఖ్యలో హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. ఐటీ, సాప్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్ గా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది విద్య, ఉపాధి, కోచింగ్ ల కోసం హైదరాబాద్ వస్తుంటారు. అందుకే అధిక శాతం మంది హాస్టల్స్ లో ఉంటారు. అయితే ఇప్పుడు భాగ్యనగరంలోని హాస్టల్స్ తీరు మారిపోయింది. ఇంతకుముందు గర్ల్స్ , వర్కింగ్ ఉమెన్స్, బాయ్స్.. ఇలా సెపరేట్ గా హాస్టల్స్ ఉండేవి. కానీ రానురాను ఇలాంటి హాస్టల్స్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు అమ్మాయి.. అబ్బాయి ఒకే రూమ్ లో ఉండే విధానం పెరిగిపోయింది. కో లివింగ్ హాస్టల్స్ నగరంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఈ హాస్టల్స్ నెలకు రూ. 10 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
OYO rooms are a thing of past. New trend is co-living.
— Tathvam-asi (@ssaratht) September 20, 2025
Co-living hostels are the modern br0th£l houses.
Boys and girls are ‘allowed’ to stay in the same rooms - such hostels are increasing a lot in Hyderabad. It’s alarming trend.
Parents don’t know what they do here.
These… pic.twitter.com/2G5GXP96Af
ఈ కో లివింగ్ హాస్టల్స్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇలాంటి హాస్టల్స్ ఫ్యామిలీస్ ఉండే ఏరియాల్లో ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. అలాగే హాస్టల్స్ లో డ్రగ్స్, గంజాయిని కూడా అక్రమంగా విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కో లివింగ్ హాస్టల్స్ కారణంగా తమ కాలనీల ప్రతిష్ఠ దెబ్బతింటోందని అంటున్నారు. అలాగే నగర సంస్కృతి, సంప్రదాయాలకు ఇవి విరుద్ధం అని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కో లివింగ్ కల్చర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హెచ్ మండిపడ్డారు. వెంటనే వీటిని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు. మాదాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ హాస్టల్స్ అధికంగా ఉన్నాయన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications